పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96 సాహిత్య మీమాంస

నది. ఈధర్మసూక్ష్మమునే పాండురాజు కుంతి కుపదేశించి దేవతాప్రభావమున పాండవుల నావిర్భవింపజేసెను; బలిరాజు అంధుడగు మునిమూలమున అంగ వంగ కళింగాది పుత్త్ర సంచకమును పొందగల్గెను. అంధునకు రూపమునం దాసక్తి యుండుట అసంభవము. ఇప్పు డుదహరించినవన్నీ పాపకలిత మగు కామమున కుదాహరణములు కానేరవు. అవి పాప రహితములు.

ఆర్యసాహిత్యమున గాంధర్వవివాహముచిత్రింపబడుటచే పూర్వకాలమున పడతులు తాముకోరిన వరులను పొందుచుండిరని స్పష్టమగును; అందుచేత అప్పటిస్త్రీలకు స్వచ్ఛ యుండెననుట తెల్లము కాదా అని అడుగవచ్చును. నిజము - స్వయంవర వివాహములు పూర్వకాలమున లేకపోలేదు. కాని అట్టి యాచారము క్షత్త్రియజాతులయందే ఉండేది; సాధారణసంఘమున నది యున్నట్లు దృష్టాంతములు కానరావు. రాజకన్యల కట్టి స్వాతంత్య్ర ముండుట నిక్కము. వీరుల కెక్కువ గౌరవ మాపాదింపబడు ఆ కాలమున అది రాజనీతిగా చెలగుచుండెను, ఆ నీతినే ఆంగ్లకవియొక డిట్లు తెల్పెను : _

           "None but the brave deserves the fair"
                "పొందదగు వీరుడే సుందరాంగులను"

సుందరినొకతెను వరించి స్వయంవరమునకు వచ్చిన రాజుల గుణములు సభలో వర్ణింపబడుచుండును. ఇట్టి వర్ణ