నీతి లేదని శాసనము లేదని ప్రేమ లేదని యీ పనికిమాలిన సృష్టి నాశన మొనర్చుటయే మంచిదని యేమేమో చెప్పితివే' యని నేనింక నేమేమో యనుచు నుండగనే తీవ్రముగ నాతఁ డిట్లనియెను.
“క్రమమా? క్రమమే!! అబ్బ క్రమము లేకపోవుటయే క్రమము. శాసనమా? అబ్బ! శాసనహీనతయే శాసనము. ప్రేమలంట! అబ్బ! సృష్టిలో నఁట-కథలలో నాటకములలో నుపన్యాసములలోఁ-గలలలో జో అంతేకాని ప్రత్యక్షసృష్టిలోఁ బ్రేమమే! ప్రేమతత్త్వమును బ్రపంచములో నొక్కపగలుమాత్రమే యాచరణములో నుంచుట తటస్టించునెడల సృష్టిలో నున్న సర్వజీవము లొక్కసారి నాశనమగుట కేమైన సందేహమా? ఒక్కజీవము మరియొక్క జీవమునకు జీవనాధారముగా నున్నప్ప డింక బ్రేమ యుండుట కవకాశమేమున్నది? మనుజుఁడు తనతత్త్వమునకు సరిపోయిన యన్నిజంతువుల నన్నిశాకములఁ దిను చున్నాడు. సరిపడక పోయినవానిని మాత్రమే మిగుల్చుచున్నాఁడు. ఒక్కమధ్యాహ్నభోజన ములో నైదారు జంతువుల జీవనములు నన్నములోఁ బదివేల శాకముల జీవనములును ద్రాగునీటిలోఁ బదిలక్షల సూక్ష్మజంతువుల జీవనములును మనుజుఁడు తన పొట్టఁ బెట్టుకొ నుచున్నాడు. వాయుభక్షణమున నెన్నికోట్ల సూక్ష్మజంతువులను నాశన మొనర్చు చున్నాడో చెప్పఁదరమా? ప్రేమమునకు లక్షణము చంపి తినుటయే యగునెడల సృష్టిలోఁ గావలసినంత ప్రేమ మున్నది. దినమునకు నాల్గుకోట్ల జీవనములను గుటుక్కున మ్రింగి గర్రునఁ బొట్టు నింపుకొని, బఱ్ఱునఁ ద్రేంచి, ప్రపంచము ప్రేమమయ మైయున్న దని సభాపీఠముల బోధించు మనుజునే మనవలయును? మోసగాఁ డనినఁ జాలునా? కటికవాఁ డన్నఁ జాలునా? ఆతని నేమనునెడలఁ దగియుండునో చెప్పము-ఓ! లొడలొడమని యుపన్యసించువాఁడవుకదా? ఏదీ? నీతరమగునా? మనుజుఁడు చేయుచున్న యక్రమచర్య కాతని కనుగుణమైన తిట్టు శబ్దజాలమునఁ జూపం గలవా? "ఏవో కొన్ని జంతువులను గొన్ని శాకములను మాత్రమే మనుజుఁడు బుద్దిపూర్వకముగఁ దప్పనిసరిగఁ దనలోఁ బడి నశించు ప్రాణుల విషయమున నాతం డేమి చేయవలసిన దని నీ వందువేమో? ఏమి చేయవలసినదా? ఇఁకఁ బ్రేమోపన్యాసములు పలుకక తప్పనియెడల స్వార్దప్రేమమే కాని పరార్దపేమము ప్రపంచమున లేదని స్పష్టముగాఁ జెప్పవలసినదని చెప్పము. ఎంతసేపు తనతిండి, తనసు ఖము, తనధనము, తనకీర్తి-అంతే తన కెంతవఱ కుపయోగించునో యంతవఱకే తలంపు; అంతవఱకే మాట; అంతవఱకే చేష్ట అస్వార్థపరత్వములోనే పెద్దతల యున్న వానికిఁ బెద్దతలఁపు. పెద్దనో రున్నవానికిఁ బెద్దమాట. పెద్దచేయి యున్నవానికిఁ బెద్దచేష్ట్ర పెద్దబుద్ది యున్నవానికిఁ బెద్దయాశ. పెద్దకడుపున్న వానికిఁ బెద్దతిండి. పెద్దబల మున్నవానిది పెద్దపెట్టు. చిన్నప్రకృతి వాని కన్నియు జిన్న-ఇదియే భేదము. ఇంతకంటె భేదమేమియు లేదు. అందరుకూడ స్వార్థపరులు. పెద్దవారి స్వార్థపరత్వముచేఁ జిన్నవాఁడు బాధపడుచుఁ దనకంటెఁ జిన్నవారిని దాను బాధించును. రాజుగారు మంత్రిని జీవాట్లు పెట్టఁగ మంత్రి తనయింటకిఁ బోయి యిల్లాలి నడ్డమైనతిట్టు తిట్టును. ఆమె తనపిల్లను గోపమున దౌడపై నొక్కటి వ్రేయును. ఆపిల్లయుడుకుఁబోతుదనమునఁ దనబొమ్మను నేలవైచి పగులగొ ట్టును. ఎంతసేపు నొకనిచేయికంటెఁ దనచేయి పైనున్నదను సంతోషము తనకు మిగులవల యును. ఒకని బాధించుటకుఁ దగినశక్తి తన కున్నదనుసంతోషము తనకు మిగులవల యును. ఎట్టిపనిలోనైనఁ దనయాధిక్యము తననంతోషమే కావలయును. అందుకొఱకే,