Jump to content

పుట:SaakshiPartIII.djvu/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రియఃపతీ, రక్షింపు మని మొఱపెట్టుకునే యున్నాము. చెంబుతప్పెలయు దొడ్డి దారిని బొరుగింటికిఁ బంపించుచునే యున్నాము. ఈచర్యకర్థమేమైన నున్నదా? ప్రయోజన మేమైన నుండునా? మనకంటెఁ బైవారెవ్వరు నిక్కడ లేకపోవుట చేతను, గొంచెము హెచ్చుతగ్గుగ నందఱ మొక్కటే తరగతిలోనివార మగుటచేతను సరిపోవుచున్నది గాని, దేవతలు మన యీ యసందర్భచర్యలను జూచునెడల వారు పైనుండి మనమొగములపై నుమియుదు రేమో!

మనబుద్ధు లెంత, మనశక్తు లెంత, మన ప్రయోజకత లెంత, మన పాండిత్యము లెంత, మనదూరదృష్టు లెంత, మన ప్రయత్నము లెంత? తెలియఁదగిన యంశ మేదియు మనకుఁ దెలియనే తెలియదే. నిజమాలోచింపఁగ మట్టిలోఁ బొరలెడుకీటకములకంటె మనమె ట్లెక్కువయో నాకు బోధపడలేదు. ఆహారనిద్రాదులతో నవియు మనముఁ గూడ సమానప్రతి పత్తితోఁ గాలక్షేపము చేయుచున్నాముగాదా? మనుష్యులమై పుట్టినందులకు, సృష్టికిఁ బ్రభుల మని సిగ్గులేక చెప్పకొనుచుండునందులకు, మనకు రవంత యదనముగ నేమైన సుగుణసంపత్తి యుండవలదా? భగవద్భక్తియే మనకు లేకుండునెడల నవియు మనము నొక్కమట్టము లోనివారమే కాదా? (’కీటకములకు భక్తియున్నదేమో. మనమెట్టు చెప్పఁగలము' అని సభలోఁ గేక.) అటులైన మనము, కీటకములకంటె నధమప్రాణుల మనుటకు సందేహమేమి? చేసిన ప్రయత్నము లెన్నెన్నియో భగ్నములై పోవుచున్నవే. ఎంతెంత ప్రయత్నములో చేయుచున్నామే. ఎన్నెన్ని యాసలోఁ బెట్టుకొనుచున్నామే. ఫలము నందఁగలుగుచు న్నామా? రామపట్టాభిషేకమునకు దశరథుఁ డెంతగాఁ బ్రయత్నించినాఁడు! వసిష్ణుఁ డంతవాఁడు సుముహుర్త ముంచినాఁడే. శ్రీరామచంద్రునిహస్తమున కామహర్షి పట్టాభిషేక కంకణముఁ గట్టినాఁడే అన్నియు సిద్దము చేయఁబడినవే. సీతారాము లుపవాసముచేసి రాత్రి జాగరముఁగూడ జేసిరే. మందుకొట్టంటుకొన్నట్లంతయు టప్పన నొక్కసారి యెగిరిపో యెనే. పట్టాభిషేకము లేదు సరికదా, పైఁగఁ బదునాలుగేండ్లు వనవాసమా? అప్పడు శ్రీరామచంద్రుఁడు జనుల కేమి బోధించెనో విందురా!

గీ.

జనులయత్నంబు లేపాటి శక్తిగలవొ
బుద్దు లేపాటి ఘనములో బొమ్మలైన
నరుల నాడించు నది యేదొ నావిచిత్ర
పట్టమును గాంచి తెలిసికో వలయు జనులు
ఐహికము లశాశ్వతములె నందు మనుజు
లంద తెరిఁఱినయంశమే యంద ఱెపుడు
మలచుసంగతి యది యుండె మఱవకుండ
నాచరించెడివాఁడె జ్ఞా నాధికుండు
ఘనతరంగాహతాంగంబు కల్గి కరము
నెత్తి నది దాఁటుకరివోలె నెన్నియాప
దలు సుఖమును గదల్చిన విరనదూర్ధ్వ
దృఙ్మనస్కుఁడౌ నరుఁ డు త్తరించు భవము.

నాయనలారా! ఇవి మనకు బుద్దిరాదగిన మాటలేకావా? ఎంత సేపు నధోదృష్టియే