అనేక సహస్రజన్మములు తపోజ్ఞాన సమాధులవలన పాపక్షయమైన పిమ్మట నరులకు శ్రీకృష్ణభగవానునియందు భక్తిపుట్టును. అంతకాలమైన పిమ్మట, నంతశ్రమ మొందినపి మ్మట, కృష్ణభక్తి యుదయించునని చెప్పఁబడినది. అది సందుకొట్టి చావకుండ బ్రదికి, బాల్యగండము లన్నియు దాఁటి బ్రదికి, పరిపుష్టినొంది పుష్చించి ఫలించుటకు మఱియెంత కాలము పట్టునో? ఒక జన్మములో వైయాకరణులము కావచ్చును. తార్కికులము కావచ్చును, వేదాంతులము కావచ్చును; ఇవియన్నియు గూడఁ గావచ్చునుగాని యనేక సహస్రజన్మసంసారమునఁ గాని భక్తి కలుగదు.
భగవంతుఁడు మనల రక్షించి యుద్దరించు ననమాట నిశ్చయమేనా? ఇంకను సందేహ మేమి? ఆయన రక్షించి యుద్దరింపకుండు నెడల నింక రక్షించువాఁ డెవఁడు? మృత్యుసంసార సాగరమునుండి యుద్దరించువాఁ డెవఁడు?
శ్లో. | యేతు సర్వాణి కర్మాణి మయి సన్న్యస్య మత్పరాః | |
అని కృష్ణభగవానులు సెలవిచ్చియున్నారు.
మహాశక్తియున్న యీశ్వరుఁడు కాని మనుజుల రక్షింపఁగలఁడా? అందులో నొకరా యిద్దటా? అదిగాక యనేక సహస్రజీవకోటులను రక్షించి యుద్దరింపవలయునే?
శ్లో. | శక్తే స్పూపనదత్వాత్ కృపాయోగాచ్చ శాశ్వతాత్ | |
అని పెద్దలు సాయించినారు.
సర్వేశ్వరుఁడు సర్వశక్తిసంపన్నుఁ డగుటచేతనే మనల రక్షింపఁ గలఁడు. భూమిలో నున్న రాజులు, రాజాధిరాజులు, చక్రవర్తులు మనల రక్షింపఁగలరా? వట్టిమాట. వారే మనలను రక్షించునెడల వారిని రక్షించువాఁడెవఁడు? వారికున్న కాంచనరాసు లన్నియు వారికష్టములకే కారణము లగుచున్నవికావా? వారి కున్న సుఖసాధనము లన్నియు వారికి దుఃఖదాయకములే యగుచున్నవి కావా? వారికున్న భోగపరికరము లన్నియు రోగపీడాకర ములే యగుచున్నవి కావా? అందుచే వారికున్న కష్టములు మనకష్టములకంటె శతసహస్రగు ణాధికములై యున్నవి. వా రీకష్టములనుండి విముక్తి నొంద లేక గిజగిజ కొట్టుకొను చుండఁగా, వారు మనకేమి చేయగలరు? మనకంటె వారి కనేకములైన విలువగల పదార్దము లున్నవి. మణులరాసు లున్నవి. ఏడంతరువుల మేడ లున్నవి. దాసదాసీజనశతము లున్నారు. అశ్వగజాందోళికాది సంపద లనేకము లున్నవి. కాని మానవ శక్తిలో వారు మనకంటె నెట్టెక్కువ ఘనులు? భగవంతుఁ డట్టివాఁడా? ఆయన దివ్యశక్తిసంపన్నుఁడు. అద్వితీయశక్తి సంపూర్ణుఁడు.
కాని యెంత మహాశక్తినంపన్నుఁ డైనను నాతండు మనల రక్షించు నని యెట్టు