పుట:SaakshiPartIII.djvu/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనపైఁ బడినవి. ఈపద్దతి సమంజసము కాదేమో? కాని యావాల్మీకి తిరుగబడి 'నాపుస్త కము నిన్నుఁ జదువు మన్నవాఁ డెవఁడు? నీకుఁ దెలియుట కొఱకే నేను కవిత్వము చెప్పవలయునా? ఒకనికిఁ దెలియుట యనునది కవితోద్దేశమా? నాయుత్సాహము కొలఁది నాయిష్టమువచ్చినట్టు నాసంతోషము కొఱకై నాకొఱకే పాడుకొంటి’ నని మనల ధిక్కరించు నెడల మనము కొంతసేపటి వఱకు మూఁగలమైయుండవలసివచ్చునేమో? వాల్మీకి మహర్షి చెప్పిన యధిక్షేపణము నిజమే. మామిడిచిగురువగరున జీరవదలినకంఠముతోఁ గలకంఠ మెవనికొఱకుఁ బాడుచున్నది? మధుపాన మొనర్చి పాడు తుమ్మెద నీవు వినుటకే పాడుచున్నదా? ప్రకృతి జ్ఞానాస్వాదమున మత్తిల్లి మైమఱచి వినువారు లేకున్నను వ్రాయు వారు లేకున్నను నాత్మసంతోషము కొఱ కానందగీతములను బాడు గాయకశిఖామణి కవి.

"అభ్రకం రనసిందూరం గంధకం టంకణం సమ" మ్మనుయోగము ననుసరించి యాయావస్తువులను గలిపి సింధూర భూషణమును జేయు వైద్యునివలె, వివిధములయిన రంగులను చిత్రచిత్రములగు పాళ్లతోఁ గలపి యొకవింతరంగును చేయుచిత్రకారునివలె రామాశుగ సన్నిభమైన దృష్టిని బదునాల్గు భువనము లొక్కవిసరున ముందునకు వెనుకకుఁ బఱపి సర్వవస్తుజాలమును బరిశీలించీ యావస్తువులలో దేనిదేని నేయేవిధములుగా గలసిని బాగుగా నుండునో యోజించి యట్టు కలపి నూతన వస్తువుగఁ జేసి వాని నుంచుటకుఁ దావు, వాని బిలుచు టకుఁబేరుకల్పించి వానిని వాగ్రూపములగు ప్రతిమలను జేసి మనయోదుటఁ బెట్టఁగలద్వితీయద్వితీయ సృష్టికళా బ్రహ్మయగు నాతఁడు కవి.

కవి పిచ్చివాఁడనుమాట సత్యమే. ఎట్టిపిచ్చిలో నేమాత్రమైన వెగటును లేదో, యెట్టిపిచ్చి జగదుద్దరణపట్టిష్టమో, యెట్టిపిచ్చిలో జ్ఞానవిజ్ఞానములు దుర్నిరీక్షమైన తేజస్సుతో వెల్గునో, యెట్టివెఱ్ఱికి వేయి విధములు గాక, కోటి విధములైనను బరమార్థగ్రహణ విధానమున నొక్కటే విధము గలదో, యెట్టి వెఱ్ఱి వెఱ్ఱులన్నిటికంటె వెఱ్ఱిదో, యట్టి వెఱ్ఱిని, నట్ట లోకాతీతయెన వెఱ్ఱిని, నట్టి వెఱ్ఱి లేని వెఱ్ఱిఁ గలిగి తాను ధన్యుడై ధన్యముజేయు నాతండు కవి.

ఆ.

మల్లెపూవుఁ దూeటీ మధుపంబుతోఁ బాడి
గంధవాహుతోడఁ గలసి వీచి
యబ్దిలోన మునిఁగి గలసి వీచి
యబ్లిలోన మునిఁగి యార్వవహ్నిని గ్రాంగి
నీటిబుగ్గ యగుచు నింగిఁ బ్రాంకీ
తోఁక చుక్కతోడ డీకొని శ్రమంజెంది
సాంద్య రాగనదిని స్నానమాడి
తనువునిండ నింద్రధనుసురంగులు పూసి
కైరవాపుసుధను గైపుఁ జెంది
గోళగానరుతికి మేళవింపుగం బాడి
పాడి యూడి పాడి యూడి సోలి
భావనామహత్వపటిమను బ్రహ్మమై
పోవుకవికిం గోటిమ్రొక్కు లిడుదు.


ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః