పుట:SaakshiPartIII.djvu/263

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాంధ్రజాతికొఱకైనను, దమ యాంధ్రత్వమును నిలువఁ బెట్టుకొనుటకైనను గొనక తప్పదు. కొన్ని గ్రంథములు చదువనైన నక్కఱలేదు, చదివినయెడల మరింత మంచిదె. భాషాజ్ఞానమును సంపాదించుకొని కవులను పోషించినయెడల మరింత మంచిదే. పోషించుట యేమున్నది? పుస్తకమును గొన్నయెడల నంతే చాలును. భారత భాగవతము లెరుంగ మివాడు బారిష్టరైన నేమి? భండారాధిపతియైన నేమి? ప్రభుడైననేమి? బ్రహ్మాండనాయకుఁ డైననేమి? ఆత డాంధ్రుడుమాత్రము కాడు. ప్రజాపోషణము గ్రంథకర్తలకత్యావశ్యకము, మనదేశమునందే లేదు గాని నిగిలినయన్ని దేశములందుఁ గూడఁ గవులకుఁ బ్రజాపోషణ మున్నది. ఈ నిర్భాగ్యత, యీ దురవస్థాగ్రగణ్యము మనదేశమందే. ప్రభువు లెందరుకవు లను బోషింపఁగలరు? ఎంతకాలము పోషింపఁగలరు? ప్రజ లాభాషాపోషణభారమును గొంతవహించుట విధి. దేశభక్తియని, భాషాపోషణ మని, స్వార్థపరిత్యాగ మని, స్వరాజ్య మని, మరియేమో యని యార్యావర్తదేశమంతయు నట్టుడికినట్టు డుకుచున్నప్పడే యార్యా వర్తదేశభమునుగూర్చి యవతలిప్రపంచమంతయు నాందోళనపడుచున్నప్పడే యాఱణాల డబ్బు లిచ్చి యొక్క యాంధ్రగ్రంథమును ననేకసహస్రసమార్జనసాహితీ చక్రవర్తులలో నొక్కడైనఁ గొనలేకుండ నున్నాఁడే ఆహా! ఏమి యాంధ్రదేశ భాగ్యము! ఇంకఁ జాలును, దానికిఁ జాలును; మనకుఁ జాలును,

నిజమే. గ్రంథము లెల్లెడలఁ బయలువెడలుచున్నవి. గోరంటలు పట్టుచున్నవి. గుల్ షబులు పుట్టుచున్నవి. గులాబులు పుట్టుచున్నవి. కుక్కగొడుగులు పుట్టుచున్నవి. అన్నయు మంచివే పుట్టవలెనని ప్రకృతిలో శాసనమున్నదా? ఎచ్చటనైన నటులు పుట్టినవా? ఏకాలమందైన నట్టు పుట్టినవా? ఏజాతిలోనైన నట్టు పుట్టినవా? ఉహుహు. అన్ని యెడల నుహుహన్న ప్రకృతి మనయెడల మాత్రము “ఊ' యని యేల యనవలయును? కలువతీగె ప్రక్కనే మొండిచేయి; ఘనాఘనగర్డ వెంటనే కప్పకూఁత; దేశకాలపాత్రముల బట్టి ప్రకృతి తన మనోభావమును బహిర్గత మొనర్పకతప్పదు.

మామిడిపూఁత యెట్టిదో మసూచిపోఁత యట్టిది. గోరంటపూవు వాసన యెట్టిదో కోరింతదగ్గట్టిది. గుబ్బలాఁడి కంటితళు కెట్టిదో మబ్బులోని పిడు గట్టిది. పద్మములోని మధు వెట్టిదో పాములోని విస మట్టిది. గ్రంథకర్తరణ గీతమెట్టిదో యతిమూత్రరోగి రాచపుం డట్టిది. అన్నియుఁ బ్రకృతిసంబంధములే. అన్నియు బహిర్గతాంతస్తత్త్వములే. అయిన నేమి? చూలింతరాలివేవిళ్లకు సూడిద లిచ్చుచున్నాము. కలరావాంతులకు కర్పూరారిష్ట మిచ్చుచున్నాము. మొగలిపూవును గులకొంత కొప్పలో నుంచుచున్నాము. మూలవ్యాధిని ఛేదించుచున్నాము. అటులే గ్రంథము లన్నిటిలో మంచివానిని బహుమానింపవలయును. చెడ్డవానిని బహిష్కరింపవలయును.

వైద్యశాస్త్ర మెందుకుఁగలిగెనో, ధర్మశాస్త్రమెందుకుఁగలిగెనో విమర్శనశాస్త్రము కూడ నందుకె గల్గినది. వైద్యశాస్త్రమునకున్న వ్యాప్తి విమర్శనశాస్త్రమునకు లేదు. నిజమే. అటులేల యుండును? మాటవచ్చినది కావునఁ జెప్పచున్నాను. మీ రెంత ప్రశస్తమైన భావగీతమును బాడినను బాముకా టంతశీఘ్రముగఁ బ్రాణము తీయఁగలరా? గోడయున్న యెడలఁ జిత్రకర్మమునకు లోపమేమని ముందు మనవారు తనువులు భద్రపఱచుకొనుటకుఁ దంటాలువడి వైద్యశాస్త్రమును ధర్మశాస్త్రమును సృష్టించినారు. కావున విమర్శనశా