పుట:SaakshiPartIII.djvu/264

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్త్రము ప్రధాన కృత్యముకాక వేడుకపనియైనది. కాగితములు చవుక యగుచున్నవి. అచ్చుశాలలు వృద్దియగుచున్నవి. నాటకసంఘములు హెచ్చగుచున్నవి. గ్రంథమాలలు ఘనము లగుచున్నవి. కవులు మితిమీరి పోవుచున్నారు. గ్రంథము లసంఖ్యాకము లగుచు న్నవి. వీనిలో మంచి వేవో నిర్ణయించి చెడ్డవి త్రోచివైచుట ప్రకృతి పద్దతినిబట్టి యావశ్యకమై యున్నది. ఇవి యన్నియు భూమికి భారమగునని యెవ్వఁడును జెప్పటలేదు. వీనివలన వచ్చిన బాధయేదో చెప్పెదను. మాయముత్తెమున కున్నతళుకు మంచి ముత్తెమునకు లేదు. ముచ్చె బంగారమున కున్న మెరుఁగు మేలిమి కున్నదా? అసత్యమున కున్న చాకచక్యము, జమత్కృతి సత్యమునకు కెక్కడిది? అది మున్నాళ్ల ముచ్చట. ఇది ముప్పదితరముల కైన పోనిది. అల్పగ్రంథమునకు హర్షించినవారే యనేకులు మంచిగ్రంథమును దెలిసికొని యనుభ వించినదాఁక నెవనికి? మహాజనులారా! నూటి కెనుబదుగురు రస గ్రహణమునఁ గేవలము మూడులు. వారు పామరుల తయితక్కలకు బళీయందురు కాని ప్రకృతిలోని తలవెండ్రుకల చిక్కువిప్పిన గ్రంథములకు సంతసించెదరా? ఉహు. చెంచునాటకమున కున్న జనానురాగము శాకుంతలమున కేది? పంచదారకుఁ బట్టిన యెర్రచీమలకంటెఁ గుంకుడుకాయలకుఁ బట్టిన యెర్రపురుగు లెక్కువకదా! ఇంక గ్రంథకర్తలమాట చెప్పెదను. గ్రంథకర్తలలో నుపజ్ఞాసహితుఁడు వేయి కొక్కఁడైన నుండునో లేదో అనేకు లేదైన నొకగ్రంథమామోదించి యాకవిని బహుమానించుట సిద్దించునెడల "ఆహా! వ్రాయవలసిన పద్దతియదియే కాఁబోలు! మనముకూడ నష్టే వ్రాయ వలెను గాంబోలు!’ నని యనేకకవులు భ్రమపడుదురు. పైకి వారిని దిట్టుచునే యుందురు. కాని లోపల, నీయపోహములకు లోనైయుందురు. వారంత క్రమముగా దిగి యంతకంటె జారి యధఃపతితులై నీచగ్రంథ సృష్టినిర్నిద్రులై ప్రకాశింతురు. మరికొంద రింకొకవిధముగా మారుచున్నారు. అయ్యవారులుగారి పాటలనాటకమునకుఁ బండ్రెండువందల రూపాయలొక్కరాతిరి వచ్చిన వనంగ నిఁకఁ బ్రకృతి లేదు. పాత్రాచిత్యము లేదు. ఏమియు లేదు. పదిదినములలోఁ బాటలనాటక మొక్కటి కవి ప్రజలపై బాఱవైవవల సినదే. పాటలనాటకములు ప్రకృతివిరుద్దము లని యాతం డెఱిఁగియుండియు బైసకొరకుఁ బ్రఖ్యాతికొఱకు బహుళముగా ధన మిచ్చి వ్రాయించుకొను నాటకసంఘముల కొఱకాతడు వ్రాయును. కడుపు కక్కురితిచే మనస్సాక్షికి బోధన కాతఁడు వ్యతిరేకముగఁ బ్రవర్తించును. సామాన్యబుద్ది యుక్తుఁడైన యాతండట్టు ప్రవర్తించుట విశేషము గాదు. మహాధీశాలియై శారదా దేవిచే త్వమేవాహమ్మని యనిపించుకొనె నని చెప్పఁబడిన కాళిదాసుఁడు సైతము సామాన్య జనాభిరుచి ననుసరించి రఘువంశములోని కడపటి సర్గలలో నవలానవ లాలితేత్యాది శబ్దమ త్కారములను గవిత్వములో సింగారించి కవిత్వము భ్రష్టపఱచుకొనె నని పూర్వవిమర్శకులే వెల్లడిచేయలేదా! మన యీదేశమందే యిట్టిసన్నివేశముకాదే. అలెగ్జాండరు పోపు (Alexander Pope) కవిత్వము వాని ననుసరించిన వారికవిత్వము వట్టి గజము బద్దకవిత్వ మని, తక్కెడ తవ్వకవిత్వమని యెరిఁగియున్న బైరన్ (Byron) వంటి స్వతంత్రబుద్దిసహితుఁడు సైతము యశఃకనకము లపేక్షించి తనకవిత్వముకూడ కంపను కవిత్వములోనికి దింపినాఁడు కాదా! అంకవాటకములకు డబ్బు రానియెడల రంగనాటకములనుఁ వ్రాయుదము. అంతే. దేని వాలమట్టుల నాటకములకు డబ్బు రానియెడల పార్సీమట్టులనాటకముల వ్రాయుదము. దీని కింతయోజన యెందుకు. పార్సీమట్టుల నాటకములకు డబ్బు రానియెడల బ్యాండు ట్యూన్సు (Band tunes) నాటకములఁ జేయుదము. దానితెగు లంతటితో డక్కునఁ