పుట:SaakshiPartIII.djvu/216

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొలువు చేయించుకోవయ్యా! ఎందుల కింతయోజన! నీ విచ్చు భత్యము నా కేమియు నక్కదఱలేదు. వింటివా? పూఁట కొక్కయతిథి కన్నము పెట్టి మిగిలిన గంజితో నా కూతును రక్షించుకొందును. నేను నా భార్యయుఁ బస్తుండెదము. కాదేని కాయయమో కసరో తినుచుందుము. మామాట కేమి?" అని బ్రాహ్మణుడు పలికెను. ఇంకను నబాబుగారు నిల్వుగ్రుడ్లవైచుకొని చూచుచుడంగా, 'నీతో నాకేమి పోవయ్యా రా జన్న ప్పడు పోతరాజుగారే రాజుగాని నీ వెక్కడి రాజువయ్యా' యని యాతండు పోబోవుసరికి నబాబుగారు భటులకుఁ గనుసన్న చేసిరో యేమో కాని నల్వురుభటులు సుబ్బరాజుగారిని సున్నములోని కెముకలేకుండ గొట్టిరి. సుబ్బరాజు గారు రామరామ యనుచు నా దెబ్బలన్నియు నే మాత్రము తిరుగుబాటయిన లేకుండ కన్నయిన జిట్లించుకొనకుండ సహించెను. మఱి యొక భటు డింతలో వచ్చి యాయన జన్నిదమును దైంపబోవఁగ నాతని నెత్తిపై తన గంటము మొదటితోఁ గొప్టెను. వాఁడు గిలగిలలాడుచుఁ గ్రిందబడిపో యెను. అంత సుబ్బరాజుగారు కారాగృహమందుపబడిరి. నబాబుగారు తమ మహలునకు బోయిరి.

III

స్పోటకపువ్యాధులచే, విషూచివ్యాధులచే నా మహమ్మదీయ గ్రామమంతయు నిండి యున్నది. జనులు కుప్పతిప్పలుగాఁ జచ్చుచున్నారు. బండ్లమీఁద వైచి శవములను దీసికొని పోవుచున్నారు. సుబ్బరాజు గారి కారాగృహమున కొక్క నలువది బారల దూరములో నొక కానుగు చెట్టున్నది. అది వీధి ప్రక్క నున్నది. దాని క్రిందనే దుర్గమ్మ యామెకూతుతో నివసించుచున్నది. తనకు, దనభర్తకు నన్నము లేక పోయినను ఏజిరుగడమో కఱ్ఱపెండలమో తిని కాలక్షేపము చేయగలరు. కాని, అయిదేండ్లపిల్ల అట్లు బ్రదుకగలదా? ఆపిల్లను సంరక్షించుట కామె యొచ్చటినైన దాస్యమున కొప్పకొని చేయవలయును గదా! ఎక్కడెక్కడ దిరిగినను సదుపాయమగు నౌకరి దొరకలేదు. తుదకొక్కయింటు నెల కొక్క వరాజీతమున కొప్పకొని యాయింటను స్పోటకపు వ్యాధిచే బాధపడుచున్న యొక కాంత కుదయమునుండి సాయంకాలమువల కుపచారము చేయుట కంగీకరించెను. మాసవేతనములో దీర్చుకొవనుపద్దతి మీద నొక్క మాడ ముందుగా దీసికొని పిల్లదానికిఁ గావలయు సామగ్రి కొని కుండతోఁ దెల్లవారకముందే రవంత వండి, కూతునకుఁ బెట్టి, దానిని దండ్రిగారాగృహముగుమ్మము వెలుపల విడిచి, తాను సేవకుఁ బోవుచుండును. ఇట్టు పదునైదు దినములు గడవకుండ నామెపిల్లకు జ్వరము వచ్చెను. పుచ్చుకొన్న మాడ కింకను రెండు దినముల సేవ బాకియున్నది. ఋణము తీర్చుకొన కుండరాదనియు, నుచితముగ నెవ్వరి సొమ్మును దీసికొనఁగూడదనియు నాజ్వరము తోడనే పిల్లను గారాగృహాంగణమున విడిచి సేవకుఁ బోయి యాబాకి తీర్చుకొని, యంతట నుండి సేవకు రాజాలనని చెప్పెను. పిల్లకు స్పోటకము వచ్చినది. రెండీతాకు లడ్డుకట్టుకొని యాచెట్టుక్రిందనే వాని చాటునఁ బిల్లను బెట్టుకొని కంటికిమంటి కొక్కధారగా నేడ్చుచుండును. తండ్రి కారాగృహమందు భీష్మస్తవరాజమును జదువు కొనుచుండును. ఇట్లుండఁగాఁ బైటచాటున గుడ్డలలో బిల్లను బెట్టుకొని యొక్కనా డుదయమున దుర్గమ్మ కారాగృహమునొద్దకు వచ్చి పిల్లను తండ్రికి జూపి యేడ్చెను. ఉదయ మయిదుగంటలకే యాపిల్ల మరణించెను. మృతినొందిన తనకూ