పుట:SaakshiPartIII.djvu/215

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అది మహమ్మదీయుల రాజ్యము. ఆయూరిపేరేదో తెలియదు. జోడుగుల్జాల బండిమీద నవాబుగారు బయలుదేఱి -కాసు" తొటు జూచి తిరుగ నింటికిఁ బోవుచు న్నారు. ఆదారిలో నొక బ్రాహ్మణుడు నిలువబడియున్నాఁడు. గుఱ్ఱపుబండి వచ్చుచు న్నది. " ఓయబ్బా ఆపవయ్యా బండి! ఒక్క పేపరుగా?" యని బండివాని కాతఁడు కేక వైచెను. బండియాపక యాతడు తోలుకొనిపోవుచుండంగా నా బ్రాహ్మణుఁడు గుఱ్ఱపుంగళ్లెములు బట్టుకొని బండి నాపెను. గుఱ్ఱములు బెదరుచున్నవి. కాని వానినిగదలనీ కుండ నాతండు పట్టుకొనియున్నాఁడు. ముందుఁ గొంతదూరము పోయిన తురుపుసవారులు వెనుకకుఁ దిరిగిరి. మలకి కొందరు జనులు మూగిరి. నబాబుగారు బండి దిగినారు. ఆయన యొద్ద కాతండు వెళ్లి' మాయబ్బ! నీవేనటయ్యా! ఈచుట్టుపట్టు పొలాల కంతకును రాజవు? సరేకాని, నా కేమైన భత్యమేర్పాటు చేసి తాటాకుగ్రంథములు వ్రాయింపరాదఁ టయ్యా! నాకు జరుగుబాటుగను నుండును. నీకు ఖ్యాతిగాను నుండును. సుఖముగాగూరుచుండి వ్రాయుదును. నీ కచ్చేరిలోనికి నన్ను రానీయరని నిన్నుఁజూచుట కీడకు వచ్చినాను. ఎవరేమి చెప్పకొందురో వినవచ్చును. బండి నిమ్మళముగాఁ దోలించుకొనరా దయ్యా' యని నబాబుగారి ననియెను. బ్రదుకు దెరువు కొఱకుఁ బ్రభుని ప్రథమమున సందర్శించునప్పటి సంభాషణమిట్టున్నది. పాపము! భటత్వమెఱుఁగునా? ప్రభుత్వ మెఱుఁగునా? మన్ననయెఱుఁగునా? మార్దవ మెఱుఁగునా? మర్యాదయెఱుఁగునా? మాటతీ రెఱుఁగునా? అయ్యో! వట్టిజానపదుడు. రూపమున మోట. వస్త్రమున మోట. పలుకున మోట. వట్టి నిష్కల్మషుడు. అమాయకుఁడు. మనసున నొకటి నోట నొకటి యున్నదా? శుద్ద సత్యకాలపువాఁడు. ఋషి విగ్రహుడు. హరిహరీ! ఇప్పటి యింద్రజాల మహేంద్రజాల మహామహోపాధ్యాయులలోనివాఁడా? ఇప్పటివారిలోఁ గొందఱు సత్యసంధులకుఁ దక్క దఱచుగా నెవ్వరినిఁ జూచినను నొసలు వెక్కిరింపు. నో రిగిలింపు. మొగమెదుట నమస్కార ములు. వెనుక దిరస్కారములు. పలుకు తేనెపట్టు. పిడికిలి కోఁతిపట్టు. పెదవిని మందహా సము. హృదయమునఁ జంద్రహాసము. ఆత డిట్టివారిలోవాఁడా? తన కుపకారపు మాట యేదో యెఱుగడు. ఎదుటివాని కపకారపు మాట యేదో యెఱుఁగఁడు. మనసులో నేది సత్యమని తోఁచునో యది పైకి రావలసినదే. ఆ వచ్చుటలో నొక సాపులేదు. సంతన లేదు. నీటు లేదు. మాట లేదు. వట్టి కఱ్ఱపడి కంకరరాతిపాకముతో రావలసినదే ఆత డనిన మాటలు విని నబాబుగారు కొంత నిశ్చేష్టితులై యూరకుండిరి. నబాబు గారివంటి వానిని సుబ్బరాజుగా రెట్టు చూడలేదో, సుబ్బరాజు గారి వంటి వానిని నబాబుగా రట్టు చూడలేదు. 'మాయబ్బ, అదేమి చూపయ్యా!

"కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం జెందరే?
వా రేరీ సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై
బేరైనం గలదే శిబిప్రముఖులున్ ప్రీతి న్యశస్కాములై
యీరే కోర్కుల వారలన్ మజచిరే యిక్కాలమున్ భార్గవా!"

యని పోతరాజుగారు సెలవిచ్చిరయ్యా! అడుగక యడుగక య`రువదియేండ్ల కడిగినానయ్యా! నీపాలా లన్నియు నా కూరకే యిచ్చినను నా కక్కఱలేదు. ఏదో