పుట:SaakshiPartIII.djvu/199

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హిమాలయప్రాంతమునుండి వచ్చిన యొకమహాయోగిని నేఁడీసభలో నుపన్యసిం చును. సావధానచిత్తులరై వినగోరెదను.

మహాయోగిని యుపన్యాసము

పుష్పములలో గులాబి యెట్లో, ఱాలలో వజ్ర మెట్లో, లోహములందు కాంచన మెట్లో, మగవారిలో శూరుఁ డెట్లో, యాండువారిలోఁ బతివ్రత యుట్ల.

గీ. 'ధరణి నుండు ద్వితీయమౌదైవ మదియె' యని యొకకవి చెప్పినాఁడు. ఆఁడుజన్మ మెత్తితరింపవలయును. అందులోఁ బతివ్రతయై తరింపవలయును. మeటియోుక మార్గము లేదు. బ్రహ్మజ్ఞానసంపత్తిచే బదునాల్గుజన్మములకైనను మగవాఁడు మోకము నొందకపోవచ్చును కాని, నిష్పలాపేకమైనపతిభక్తిచే నాఁడది యొకజన్మములో ముక్తినొందఁ గలదు. పరమేశ్వరుఁడు కేవల ప్రేమమయుఁడే కాక ప్రేమస్వరూపుఁడు కూడను. అందుచే ప్రేమతత్త్వమే సంసారతారక మైనది.

గీ. దంపతులప్రేమవంటి దీధరణి లేదు
వారికేంతు విభన మెప్పటికి నైన
వట్టిబ్రహ్మచారికి మోక్షపదవి సున్న
జ్ఞానియగువాని కద్ది సంశయము సుమ్ము.
ప్రేమలతఁ గోయు మని మన పెద్ద లనిరి
నాకు క్షమియింపు మామాట నచ్చలేదు
జన్మరాహిత్య పరమశాశ్వతసుమంబు
భవ్యతమరాగ లతికోద్భవంబు కాదె?

అందుచేత నాడువారిలో నొక్కగృహిణికి తప్ప బ్రహ్మచారిణులకు, యోగినులకు, సన్న్యాసినులకుఁ గూడ ముక్తిలభించు నని ధైర్యముగఁ జెప్ప వీలులేదు. ప్రేమాదిరసములు పుట్టుకతోడనే మనహృదయములం దున్నవి. మనము మనుజులకంటె నధమజంతువులుగా నున్నప్పటి నుండియు నారసములు మనహృదయములం దున్నవి. ప్రియాగమనమున గుళుకు గుళుకు మను గవ్వప్రేమాతిథ్య మెట్టిదో, సతీమణియింటి కేతెంచిన భర్తపాదసేవ సరిగా నట్టిది. వానికి రెంటికిని తత్త్వమున భేద మేమియు లేదు. జ్ఞానము మనుజునకు సహజము కాకపోవచ్చునేమో కాని ప్రేమామత్రము సహజ మని యొప్పకొనక తప్పదు. అట్టి ప్రేమరస మెండ జేసికొనఁ బ్రయత్నించి జ్ఞానముచే దరింపఁబూనుట యతికష్టము. అసహజము. అవసానమున దృశ్యాదృశ్యము కూడను. ప్రేమరస మెప్పటికిని గూడ నెండునది కాదు. ప్రేమ తొలఁగదు. జ్ఞానము కలుగదు. అట్టి సంధ్యవస్థలో మనుజుఁడు చిక్కుకొని యుభయభ్రష్టత నొందుట తగదు. అట్టి ప్రేమాదిరస ములు సత్కార్యములందు, సత్పాత్రములందు, సముచితముగ, సద్వినియోగము చేసికొ నుట చేతనే జన్మసాఫల్యము కలుగును.

అది గాక స్త్రీతత్త్వ సమ్మేళనములో జ్ఞానము పాలుకంటె, భక్తిపాలు హెచ్చు. ఎందుచేత ననఁగా పరమేశ్వరుని చేతిలోన ప్రత్యక్షముగ నున్నసృష్టితంత్ర మంతయు బ్రత్యకముగ స్త్రీచే నిర్వహింపఁబడుచున్నది. ఆడుది పరమేశ్వరుని ప్రతినిధిని యైయున్నది. ప్రేమను