Jump to content

పుట:SaakshiPartIII.djvu/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26. పిచ్చివాని మరణశాసనము

మధ్య పిచ్చివాడికి జబ్బు చేసిందని తెలిసి జంఘాలశాస్త్రీ చూడడానికి ఆస్పత్రికి వెళ్లాడు. పిచ్చివాడు, జంఘాలుణ్ణి చూడగానే సంతోషించి తాను మరణ శాసనం వ్రాశాననీ, అతన్ని సాక్షి సంతకం చెయ్యమనీ, నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాననీ చెప్పి, లోపలకి వెళ్ళి కొన్ని కాగితాల దొత్తి తెచ్చి చూపించాడు. అతను వ్రాసిందేమిటో చదవకుండా తాను సాక్షి సంతకం పెడతాననీ ఎలా అనుకున్నావనీ, చదవమనీ, జంఘాలుడు, పిచ్చివాణ్ణి కోరాడు. దానిమీద, పిచ్చివాడు విసుక్కుని జమీందార్లంతా సంతకాలు పెట్టవలసిన కాగితాలన్నీ చదివే పెడుతున్నారా? అని గద్దించి నేను చదివేది ఇందులోదే చదువుతున్నానని నమ్మరేమిటని అడిగాడు. ఎప్పడో ఒకప్పడు నమ్మక తప్పదు గనుక, చదవకముందే నమ్మమనీ అడిగాడు. తనకి శనిదశ వచ్చింది కనుక మరణ శాసనం రాశానని చెప్పాడు. హరిః ఓమ్" అని కాకుండా "ఖర్మఃఓమ్" అని మరణ శాసనం చదవడానికి ఉపక్రమించి గాడిదకి, కవికీ, విష్ణువుకి వున్న సంబంధం పురస్కరించుకుని తను "ఖర్మః ఓమ్" అని చదువుతానన్నాడు. తనింక పదిహేనేళ్లు మించి బతకడని తెలిసి, మరణ శాసనం రాశానన్నాడు. గురువు, శిష్యుడు, అశాశ్వతం అని తెలిసినా, జ్ఞానం శాశ్వతం గనక ఇలా శాసనం' రాశానని చెప్పాడు. ఈ శాసనంలో మూడు అంశాలు మూలాధారాలుగా వున్నాయి. ఒకట ఎవరైనా నిన్ను పిచ్చివాడంటే, అన్నవాడికే పిచ్చి అని నమ్ము. రెండు సాధ్యమైనంతగా నీ భటులతో పోరాడు. నువ్వు మహారాజు వనినమ్ము. మూడు! అలౌకికానందం నీ జన్మధనం - ఇవి మూడు సూత్రాలు - ఇవి చెప్పి పోతన్నగారి పద్యం స్మరించుకుంటూండగా – డాక్టరొస్తున్నట్టు తెలియడం వల్లా, శాస్త్రి అక్కణ్ణుంచి వెళ్లిపోయాడు.

జంఘాలశాస్త్రి యిట్లు పలికెను:-

ఈనడుమఁ బిచ్చివానికి జబ్బుచేసిన దని తెలియుటవలన నాతనిఁ జూడఁబోయితివి. నన్నుఁ జూచుటతోడనే చేటయంత మొగము చేసికొని వచ్చితివఁటయ్యాయని యాతఁడు కేకవైచి “వచ్చినప్పడు రాకుండినవాడువలెగాక రానప్పడు వచ్చియుండినవాడు వచ్చుటయే సిద్దించినయెడల నా వచ్చుటను వచ్చుటతో గుణించినంత వచ్చుట వచ్చునో కాదా