పుట:SaakshiPartIII.djvu/185

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అదియే Factorial Zero కాదా" యని యాతం డనెను. ‘ఇప్పడు నే నెందుల’ కని యాతని నడుగ నే నీనడుమను మరణశాసనమును వ్రాసితినిలే. దానిలో నీవు సాక్షి వ్రాలుచేయుదు వని నీరాక కొఱకు నిరీక్షించుచున్నారని చెప్పి తుఱ్ఱున లోపలికిఁబోయి నాల్గు కాగితములబొత్తి నొకదానిని దెచ్చెను. అదియటునిటు రెండుసారులు తిరుగవైచి దీని కొసను సంతకమును జేయుమని నన్ను గోరెను. విననిదే సంతక మెట్టు చేయును? చదువుమని హెచ్చరించితిని. సంతకము చేయుటకుఁ జదువెందులకోయి పూల్. ఒక్క రిద్దఱు తక్క జమీందార్లు పాలక ప్రధానుడు చదివియే సంతకము చేయుచున్నడా? దినమునకుఁ బదివేలో పదునాల్గువేలో సంతకము చేయవలసిన రష్యాచక్రవర్తిమాటు యేమి? నమ్మకము మీద ప్రపంచము దొరలిపోవుచున్నది. సరే నీయిష్టానుసారము చదివెద ననుకో. నే నిందులోనిదే చదువుచున్నామని నీవు నమ్మవలసినదే కాదా? ఎప్పడో యొకప్పడు నీవు నన్ను నమ్మక తప్పనే తప్పదు. అట్టియెడల చదువకముందే నమ్మరాదా?

“అజ్ఞశ్చాశ్రద్దధానశ్చ సంశయాత్మా వినశ్యతి
నాయం లోకోస్తిన పరోనసుఖం సంశయాత్మనః"

అదిగాక నీకు విధేయుఁడనై వినిపించి నీ సంతకము గొనుటకు నేను నీ సేవకుడ ననుకొంటివా? పో! ఆవలికిఁ బో! నా ప్రధానగ్రంథము నీసంతకాని కుపోద్ఘాతముగఁ బఠింతునా. ఈ గ్రంథమును బంగాళాఖాతములోఁ బాఱవైచెదనుగాని, నే నట్టి నీచమైన పనిచేయుదునా?

శ్లో. అనా ఫ్రూతం పుష్పం కిసలయమనూనం కరరుహై, రనావిద్దం రత్నం! ఆహా! చూచితివా అది పట్టు. కాళిదాసుడు మంచి గడుసువాడు. ఏనుగమెలికవైచి పట్టినాడు. వహవ్వా శిరఃకంపనము రోమహర్షణమైన పట్టు.

గీ. తగిన కాలమందుఁ దగిన స్థలంబునం
దగిన రీతిఁ దగిన తరుణితగుల
వ్రేలుకుండలాల విద్వాంసుడైనను
గక్కుఱితిని బడక కదలిపోడు.

అంత గట్టివాఁడైన కాళిదాసుగూడ తన అభిజ్ఞానశాకుంతలములోఁ బెసరపప్పవలె జారినాఁడు. ఆతమాషా మఱియొకప్పడు చెప్పెదను. ఉత్తర రామచరిత్రలో సాక్షి కనఁబఱచిన యనౌచిత్యముకంటె నెక్కువ యనె"చిత్యము నట గనఁబఱతును.

ఎందుకయ్యా! ఈ మతిమాలిన గొడవ. మరణశాసనపు సంగతులు చెప్పమని నేను తొందరపెట్టితిని. మరణశాసనముకై నాకులేని తొందర నీ కెందులకోయి Dunce! పండితు డెవ్వఁడు బ్రతికియుండుట నీకిష్టము లేదా? “శ్లో, అతిక్రమ్య గ్రహాన్ సర్వాన్ నిహంతా పాపకృచ్చని” అన్నట్లు శనిదశ వచ్చుటచేత మరణశాసనము వ్రాసితిని. కాని యిందు గొంత కలతకొట్టున్నది కాని లేకపోలేదు. 'శరీరే రుర్ద భూతే వ్యాధిగ్రస్తే కళేబరే! యనియే కాదా మనపూర్వుల యభిప్రాయము. కావున నిట్లు యశాశ్వతత్వము శరీరమునకుఁ బుట్టినప్పటి నుండియునున్నదన్న మాటయే గాదా? అందుచేత బొడ్డుకోత, మరణ శాసనపు వ్రాఁత యొక్కసారి జరుగవలసియుండఁగ వ్యాధివచ్చినవఱకు మనవారేల