పుట:SaakshiPartIII.djvu/174

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యా:- తల్లి సెలవుపైని రోషనార్ నాకిచ్చినది. తా నిచ్చినట్టు చెప్పవలదన్నది.

షా:- ఎవరిచ్చినారని చెప్పవలసినదని నీ వడుగలేదా?

యా:- అడిగితిని. వీథిలోని ప్రజమహజరిచ్చు కొనినారని చెప్పమన్నది. అట్టే నేను కిన్నెత్తుతోఁ జెప్పితిని.

షా:- నీదోషము లేకుండ నీవు చేసికొన్నావు. నీ వుంచుకొన్న ముండదోషము గనపడకుండ సమర్ధించినావు. నాముసలి తనమునకు నీ పడుచు దనముఁ దోడుపఱచి దానిని సుఖపెట్టుటకే నీవు వచ్చితివి. నీతలఁ బగులగొట్టెదను. (చేతికర్రతోఁ దలపై గొట్టఁగ వాడు క్రిందఁ బడిపోవును).

షా:- ఈసంగతి సత్యమో, యసత్యమో? ఎవడు చెప్పఁగలడు. అసత్యమైనప్పడే తరుగని చెరుగని యప్రతిష్ట యైనప్పడు, సత్యమే యైనచో నిఁకఁ జెప్పఁదగిన దేమున్నది. దీనిని జంపించు తంత్రమున మం తాజ్ తో నాకూతులు, వారిదాసులు, వీరిదాసులు, మిగిలిన జనానావారు, వారికొజ్ఞాలు, వీరి కొజ్జాలంద రేకీభవించి నా కెదురు తిరిగినారు. ఇంత కుటుంబ వైరమును సహింపఁగలనా? కడుపునఁ బుట్టినబిడ్డ లుండగా, దిరుగ నిక్కాకు సిద్దపడిన వానిని ముక్క ముక్కలక్రిందఁ గోసినను పాపమున్నదా? నాదోషముచేతనే యింతపని జరిగినది. కిన్నెత్ వలనఁ దప్పన్నదని నాకు నమ్మకములేదు. తప్పలేనిదానిని నెట్టు చంపఁగలను? తప్ప లేనిదానిని అంతఃపురమందే యుంచుకొనుటకు నాభార్యలు సహింపకుండ నున్నారు. నాబిడ్డలే సహింపకుండ నున్నారు. నా ప్రజలు కూడ నా కెదురు దిరిగినారని భయ పెట్టుటకే లేఖను గోటవెలుపలి జనులెవ్వరో యిచ్చిన మహజరని మాయచేసినారు. ఇదియంతయు మమ్తాజ్ మహిమయే కాని మరియొకటి కాదేమో. ఇట్టి మహేంద్రజాల మధ్యమున నేను క్రొత్తరాణిని బెట్టుకొని నిర్వహింపఁగలనా? కావున దీని నెక్కడకైనఁ బొమ్మని చెప్పదును. అక్కడ దీనిసంరక్షణకుఁ దగు నేర్పాటును జేయింతును.

కిన్నెత్- (మూర్చనుండి కొంచెము తెప్పిరిలి) పాదుషా సర్కార్! నే నేదోస మెరుగను. అగ్నివలె పరిశుద్దనైయున్నాను. మంచుగడ్డవలె స్వచ్చనైయున్నాను. నన్ను - రక్షింపుము.

షా:- కిన్నెత్) లేవఁగలవా? లేనియెడల నేను రవంత యూత నిచ్చెదను. లెమ్ము.

కిన్నె- (లేచి) సర్కార్! మీరు నాకొరకుఁ జింతపాలు గావలదు. నామాటలు ఖోరానుమాటలవలె నమ్మవలెను. నేను దోషమేమియు నెరుగను.

షా:- నీ వట్టిదానివే యగుదువు. కాని నీ మీఁద నింత యల్లరియైన పిమ్మట నిన్ను నే నెట్టు నిర్వహింపవచ్చును?

కిన్నె:- ఆడుదానిపై ప్రజలకుఁ దప్పమాటఁ జెప్పకొనుటయే నైజము. బుద్దిమంతు లైన న్యాయాధిపతులు సత్యమును బరిశీలించి నిందలేదని స్పష్టపరుపవలెను గాని ప్రజలకు జడియుదురా? నన్ను మీరు న్యాయసభలోఁ బెట్టి బహిరంగముగ విచారించి, నాకు న్యాయము దయచేయుడు. -