Jump to content

పుట:SaakshiPartIII.djvu/173

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కిన్నె- ఓ! అభ్యంతరమేమి? అట్టు ముఖాముఖిని బెట్టి నిర్ణయింపుము.

షా:- యాకుతీ యని పిలువుము.

కిన్నె-యాకుతీ! (యాకుతీ వచ్చును.)

షా:- చూడు. అటుచూడు. కన్నులు పెట్టుకొని చూడు. వాఁడు నీఱంకుమగడు కాడా? నీవు వచ్చినమరునాఁడే నీ ఱంకుమగని నిచ్చటికిఁ దెచ్చి నాయెదుటనే మీవృత్తిని సాగింపఁ దలచించినారా? నీ దగ్గఱ నుబలాటముతోఁ బండుకొనుట కీగాడిదకొడుకునకు నేను జీతము బత్తెము నలంకారము లెదురీయవలసినదా? నీయిల్లు వల్లకాడుగాను. నామర్యాద నింతయైనఁ జూడ నక్కఱలేదా? వీపుమీఁద గట్టిగఁ గొట్టగ బడిపోవును) యాకుతీ! నీవు మగవాండ వగునా? కాదా? నిన్నెవరు లోనికిఁ బంపినారు? ఈతంత్రమం తయు నీవలన జరిగినది అంతయు సరిగాఁ జెప్పనియెడల నిన్ను జంపుదును. బజానాక్రింద ముందొక తమాంచా తీసికొనుము. అని కొట్టును.

యాకు:- నే నాడుదానను గాను. మగవాడనే.

నేను నీభార్యను గాటముగా వలచితిని. ఒక్కసంవత్సరము నుండి యామెను గాఢముగాఁ బ్రార్థించు చున్నాను. గొంగళి పురుగును జూచిన కంటె, నెక్కువ యసహ్యముగ నన్ను జూచినది. నే నామె యాస నిది వఱకే వదలు కొంటిని. నేను మరియొక గ్రామము పోయి యక్కడ నాకుఁ దగినదానిని, నన్ను వలచినదానిని బెండ్లి చేసికొనవలె నని నిశ్చయించుకొని పోవుచుండంగా, మంతాజ్ గారి యిద్దరుదాసులు నా యొద్దకు వచ్చి నిన్ను జక్రవర్తినిగారు బిలుచు చున్నారనంగా నేను ప్రాణముల నరచేతఁ బెట్టుకొని దాసులవెంటఁ బోయితిని. నాతో వారు చెప్పిన దేమనంగా, చక్రవర్తిగారి క్రొత్త పెండ్లికూతును నీవత్యంతము వలచితివని మేము వినియున్నాము. ఆమె నిన్ను మోసగించి చక్రవర్తిని జేసికొన్నది. నీకు రెండువేల అషరఫీ లిచ్చెదను. ఇదిగో తీసికొనుము నీ వీ యాడు వేసముతోడనే యామెయెద్ద దాసిగా నుండవలయును. నీ కెంత యదృష్టము పట్టునో యెవరు చెప్పఁగ లరు? ఇట్టిమాట లామంతాజ్ గారు పట్టుదలగఁ బలికినను, నే నిష్టపడక యింటకిఁ బోదలఁచితిని. కాని నన్ను వారు నిరోధించి యిక్కడనే బలాత్కారముగ దాసిగా నుంచిరి. మహాప్రభూ! నే నేమి చేయఁగలను? చక్రవర్తీ ఇప్పడు నన్ను బొమ్మనిన నేను సంతోషముగఁ బోవుదును. నాదోషమేమియు లేదు.

షా:- నీకును, గ్రోత్తపెండ్లి గూతునకు నిదివఱకు సంబంధము లేదా?

యా:- లేదు. లేదు.

షా:- ని న్నిట్టు బలాత్కరించి క్రొత్త రాణియొద్ద వారుంచి నారని నీ వీమెతో జెప్పితివా? లేదా?

యా:- చెప్పినయెడల నెగచి తెగనఱకించు నని భయపడితిని. నాస్వరూపము నిప్పడు బాగుగా నిదానించి క్రొత్తరాణియే మీతో జెప్పినది గాబోలును.

షా:- ఆమె చెప్పలేదు. ఈయుత్తరము చెప్పినది. దీనిని నీ కిచ్చినవా రెవరు?