పుట:SaakshiPartIII.djvu/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాలక్షేపమగునో యాదినము దినములన్నిటిలో నుత్తమమైనదని పెద్దలు నిర్వహించినారు. దేవునకు దేశభక్తునకు లేశమైన భేదము లేదు. వైష్ణవ సంప్రదాయానుసారముగ దేవునికంటు దేవభక్తుండే పూజ్యతరుడు. దేవభక్తుం డగుటవలనఁ బూజ్యం డగుమహాత్ముని ప్రశంస యీదినమున జరుగచున్నది. కావున నీ దినము పవిత్రమైన దినము. ఈస్టలమునందు జరుగుచున్నది. కావున నిది పవిత్రమైన స్థలము.

అన్ని కాలములందు, నన్ని దేశములందు దేశభక్తులెందరితో యుండిరి. వారిలో ననేకులు సంసారముల రోసి, నివాసములద్యజించి యేగిరి. ఏగహ్వరమునందో యేచెట్టునీ డనో తపస్సుచేసికొని తాము తరించిన వారేకాని యితరుల దరింపఁజేసినవారు కారు. అట్టివా రెంతయుత్కృష్ణ జీవులయ్యును వారుకూడ నొకవిధమగు స్వార్డపరులేకాని కేవల స్వార్థరహితులు కారు. శ్లో, "యస్మి జీవతి జీవంతి బహువ స్సతు జీవితి' అని కవి గాన మొనర్చినాడు. ఎవని జీవమువలన ననేకులు జీవింతురో వాండే జీవించినవాఁడని యాతండు చెప్పినాఁడు. అదియే నిజము. కాని దానికి మఱికొంత చేర్పవలసియున్నది. ఎవఁడు తరించుటవలన ననేకులు తరింతురో వాఁడే తరించినవాఁడు కాఁడా?

అందుచే మహాత్ముఁడు దేవభక్తుఁడేగాక, దేశభక్తుఁడు ప్రజాభక్తుఁడు ప్రపంచభక్తుఁడు. ఆతఁడు తమ శత్రువేమో యని బ్రాంతిపడుచున్న వారికిఁ గూడ భక్తుఁడు. వార్షకమున నుపక్రమించిన ఘోరతపస్సు వలని ప్రమాదము లేకుండ వెలిబడిన భక్తసార్వభౌమునిఁ గూర్చి ప్రశంసించుచుండంగా నిటనున్న గాలియే పవిత్రమగుచున్న దని చెప్పినప్పడు మన లెక్కయేమి? ప్రపంచమున సాధారమణముగ నూటికిఁ దొంబదైదు గురు స్వార్డపరులు. మిగులువా రైదుగురు కూడ తరబడిగతరబడిగ స్వార్ధరహితులే. కాని పరిపూర్ణస్వార్థరహి తులు కారు. సంపూర్ణస్వార్ధసంహారకుండగువాఁడు లక్ష కొక్క డుండునేమో? మహాత్ము డట్టి సంపూర్ణ స్వార్డచ్చేదకుడు మాత్రమే కాక నంతకంటె నున్నతపదవి నధిష్టించి నాఁడు ఎట్లు? పరుల పాపపర్వతములను తలపై వైచుకొనలేదు? వారు పొందవలసిన పశ్చాత్తాపము లను తానే పొంది దహించిపోవుచున్నాడు. కాదా? వారిపాపప్రశాంతికి తానే ఘోరతప మొనర్చి శల్యావసిష్ఠుండు కాలేదా? వారి దోషము లన్నియుఁ దనవే యని త్రికరణశుద్దిగా నమ్మిప్రాయోపవేశ మొనర్చి ప్రాణత్యాగ మొనర్చుటకు సిద్దపడినాడు. కాఁడా? వస్తుత్వము చేత, తత్త్వముచేత తనకును బరులకును భేదము లేదు లేదని ప్రత్యకముగ నాచరణయందు జూపిన యద్బుతవ్యక్తి వెనుకటి కాలములో లేఁడు. వెనుకటి సృష్టిలో లేఁడని చెప్పట యతిశయోక్తి కానేరదు. ఉక్తికెంత యతిశయతయున్నదో యంతకంటె విశేషము చర్యలోఁ జూపించిన యలె"కిక చరిత్రుని పాదపద్మముల కతిశయోక్తి దిగదుడుపు కాదా?

నాయనలారా! ఎవ్వరో గొణిగికొనుచున్నారు. ఏమందురు? ఏసుక్రీస్తు లేఁడా యని యనుచున్నారా? నాయనలారా! నేను విస్తృతి పడలేదు. ఏసుక్రీస్తు భగవంతుని కొడుకు. అందుచే భగవదంశమున జనించినవాఁడు. మేరీకన్యకుఁ బుట్టినప్పడేయాతండు దేవాంశోద్భవుఁడని గ్రహింపదగినది కాదా? అవా డెట్టివాడైనా విశేషమేమి? ఆ విశేష మేదో మామహాత్మునిది. మనుజుఁడై పుట్టి, స్వయంకృషిచే, స్వప్రయోజనకతచే, సాధనసక్ర మముచే నెంతవా డగుటకు సృష్టితత్త్వ మంగీకరించునో యంతవాఁడైనాఁడు. ఆతఁడు మొదట నాంగ్లేయ భాషాపండితుఁడే/. ఆంగ్లేయవేష ధారియే. తరువాత స్వదేశీయ