పుట:SaakshiPartIII.djvu/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22. మహాత్ముని తపఃపరిసమాప్తి


గాంధీగారు నిరశనవ్రతం పూని, పరిసమాప్తి చేశారని తెలిసిన తరవాత జంఘాలశాస్త్రి ఆ చర్యలో ప్రత్యేకత గురించి ప్రశంసిస్తూ ఉపన్యాసం చేశాడు.

వైష్ణవ సంప్రదాయం ప్రకారం దేవుడి కంటె భక్తుడే పూజ్యతరుడు. దేవభక్తుడు కావడం వల్ల పూజ్యుడైన మహాత్ముని ప్రశంస ఈరోజు జరుగు తోంది.

మూడడుగులున్నర వడుగు బలిచక్రవర్తి చూస్తుండగా, మూడడుగు లని చెప్పి సృష్టినంతా ఆక్రమించినట్టే, రమారమి అయిదడుగులు పొడుగు కల మనిషి సర్వప్రపంచ మానవ హృదయాలను గాఢంగా ఆక్రమించుకున్నాడు. మహాత్ముడు ఈ ఒక్క జన్మానికే తరిస్తాడని చెప్పవచ్చు. ఆత్మపరి ణామ క్రమంలో, అలనాట విష్ణుభక్తులైన జయ విజయుల కంటె మహాత్ముడు అగ్రస్థానం ఆక్రమించుకోగలడు. మొదటి మహాత్ముల్ని మనం ఎరగము. ఇప్పటి మహాత్ముని కాలంలో జీవించడం వల్ల పుణ్యాత్ములం. ఆయన మనస్తత్వాన్ని చదివి, జన్మాన్ని సార్ధకం చేసుకోండి. మనకీ, భగవంతుడికీ మధ్య మహాత్ముడు మజిలీగా వున్నాడు.

నాయనలారా! చదువులన్నీ కట్టిపెట్టండి. వాటివల్ల ఏం ప్రయోజనం లేదు. చదవదగిన పుస్తకం చదవండి. అది పర్ణకుటీరంలో వుంది. దైవప్రార్ధన చేద్దాం అని జంఘాలశాస్తి అంటూండగా ఒక క్రైస్తవ మత గురువు లేని, గాంధీ గారి ఉపన్యాసం గురించి ప్రస్తావించి ఉపవాసం రహస్యంగానే తప్ప బహిరంగంగా చేయకూడదని జీసస్ చెప్పాడని చెప్పాడు. జంఘాలశాస్త్రి జీసస్ దేశకాలాలకీ, మహాత్ముని దేశ కాలాలకీ తేడా వుందని చెప్పి, సభను తన ఒక్కడి ప్రార్ధనతోనే ముగించ వలసివచ్చింది.

జంఘాలశాస్తి యిట్టు పలికెను:

మహాత్ముఁడు మహోదారమగు తపస్సును నిర్విఘ్నముగఁ బరిసమాప్తి నొందించి ప్రపంచమున కానందము కలుగఁజేసినందుల కాలోకోత్తరపురుషునిఁ బ్రశంసించుచుఁ బరమేశ్వరుని ధ్యానించుటకంటె సార్థకమైన కృత్యము వేఱొండు లేదు. ఏదినమున హరికథా