Jump to content

పుట:SaakshiPartIII.djvu/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రహ్మరంధ్రమున నుండి యమృతబిందు వంగిటలోనికి మహాపుణ్యాత్మునికి మోక్షకాల మునందుఁ బడునఁటు. అట్టిబిందువు మలకింత శీఘ్రమగు స్థానమునుండి జార్చి యంగిటఁ బడజేయుటకుఁ జేఁతకత్తి పిడిపోటు యోగశాస్త్రసాధనము లన్నిఁటికంటె సర్వోత్తమ మని యామహా పురుషుడానతి చ్చెడివాఁ డని వాడుక. అందుకొఱకు అనగ మోక్షమును సంపా దించుటకొఱ కొకడు ప్రయత్నించునట్టును మన పూర్వుని పిడిబొకాయింపుచేత నమ్బత బిందువు నోటిలోఁ బడఁగ వెంటనే యతడు మోక్షము పొందినట్టును వింతయైనకథ యున్నది. పామరులగు జనులేదో కొంత యల్లరిచేసినట్టు కూడ జనవాక్య ముండెను. “అందఱు నా చేతఁ జావనే చచ్చినారు. నీవు చంపున దేమిటి నీమొగము. నిమిత్తమాత్రుడుగ నుండవోయి బుద్దిహీనుఁడా" యని నరునకు నారాయణుండు చెప్పిన భగవద్గీతానీతినే మనపూర్వుఁడు జ్ఞానహీను లగునప్పటి ప్రజలకు బోధించినాడఁట. అందుచేతనే నాతని కపరకృష్ణుఁ డని పేరు వచ్చెనట. జ్ఞానబోధమున నాతని యంత వాఁడు లేఁడు. మోక్షసాధనములలోఁ జేఁతకత్తి యంత సుఖమైనది లేదు.

భారతదేశమున బ్రజలుచేయు ప్రత్యాచారమునకును వేదాంతార్థ మున్నది కాని లేకపోలేదు. ఏపనికాని శరీరపోషణాదివృత్తులతో నెన్నఁడును మనము చేయుము. స్నానము దేహ పరిశుద్దికిఁ గాదు. మనఃపరిశుద్దితోఁ గర్మ మొనర్చుటకు భోజనము ప్రాపంచిక కార్యము లొనర్చుట కైన దేహదార్ద్యమునకుఁ గాదు. యోగాది సాధనములు చేసి మోక్ష మందుటకు. అటులే క్షుర కర్మమునకు గూడ వేదాంతార్ధముండక తప్పదు. అది యేదియో యోచిం తము. తలయే శరీరమందలి ముఖ్యభాగము. ఎందుచేత? మనస్సునకు స్థానమగుటచేత. మనస్పులోనే సర్వపాపము లుదయించి బయలు వెడలును. ఆ పాపములే వెండ్రుకల రూపమున తలనుండి వచ్చుచున్నవి. కురకర్మ మనఁగ పాపవిచ్చేద మన్నమాట. అందుచేత మతమే సమస్తమయిన భారతదేశ మునమట్టుకు మతగురుండు మంగలి యని చెప్పనెడల సత్యమునకు దూరమై యుండదు. మోక్ష ప్రదాతలలో మంగలికూడ నొకడు.

మమ్ముఁ బరాభవించుటకే పిల్చినారా, మేము సంకరకులము వారమా? ఏలూరివారు పరిశుద్దులా అని పెద్దకేకలు పాక వెలుపల వినఁబడుచున్నవి. అందుపై దళ్ల వెదురుకట్ట లూడఁదీసి చూచెదరేమి తన్ను, కొట్టుమని యెందఱో కేకలువేసిరి. ఒక్క నిముసములో బాకలోని వారందఱుఁ బైకి పోయినారు. పాకలోనుండి యంతకు ముందెప్పడో కాని చల్లగ జాఱి వావదూకభల్లూకముగారు పాకవెలుపల నుపన్యాస మారంభించినాఁడు “నా పరిశోధ నలు తప్పలా? వేదపురుషులందఱు మంగళ్లని నిదర్శనములు చూపించెదను." అని యాతడు వెఱ్ఱి కేకలు వైచుచున్నాఁడు. ఇంతలో రక్షకభటులు వచ్చిరి. అల్లరికి కారణమైన వారు దొరకక పోవుటచేత నేమియు నెఱుఁగని నలుగురు బడిపిల్లలను, నాదారినప్పడు చెంబుతో ముష్టికిఁ బోవుచున్న బలిజ వితంతువును బట్టుకొని కొట్టులోఁ బెట్టిరి. ఉపసంహా రోపన్యాసమున నంతయుఁ జెప్పవలయునని ప్రారంభోపన్యాసమును నాల్గుముక్కలలోఁ గడతేర్చితిని. అవకాశములేక యుపసంహారోపన్యాసమును మానితిని. సభ తుద కిట్లయ్యె.

ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః