పుట:SaakshiPartIII.djvu/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తడిపినాండా? ఏమియు లేదు. దినములు దొరలిపోవుటకు మనసంఘమె ట్లేర్పాటయినదో వారి సంఘముకూడ నందులకే యేర్పాటయినది. దేశసేవ యని లోకోపకార మని, బుద్దిహీనులు బోధించెడి బోధకాలిమాటలు బూటకములు. కోట్లకొలఁదిధనముతో వ్యవహరించు సంఘమైనఁ గూటికొఱకే- ఆరోగ్యప్రదానమునకై పాశ్చాత్యదేశీయు లిట స్థాపించిన యాసుపత్రులు, ధర్మసంస్థలు మొదలైన వన్నియు దనసంపాదనకే. జ్ఞానబోధముకొఱకు మతగురువులను దేశదేశములకు బంపుసంఘములన్నియు సందేహరహితముగ సంపాదనకే - వారివలన లోకమున కేదియో యుపకారము జరుగుచున్నది కాదా యని యందురా? వారివలననే యన్నమాట యేమి? ఎన్నియో యీగలను దనపొట్టును బెట్టుకొని బల్లి యంటు రోగములను బ్రాంకకుండ నాపుచున్నది కాదా? బల్లి లోకోపకారమునకే యట్టు చేయుచున్నదా? పిల్లి యెలుకల నెన్నింటినో చంపి మారికావ్యాధి నరికట్టుచున్నదికాదా? పిల్లి లోకోపకారమునకే యట్టు చేయుచున్నదా? మాటలచే మనము మనల మోసపుచ్చుకొనుట తగదు. లోకమునఁ బ్రతిజీవము వలననే కాదు, ప్రతినిర్జీవ వస్తువులనగూడ లోకోపకా రము జరుగుచున్నది. వేపాకువలన మసూరిరోగము స్తంభించుచున్నది. తెల్లజిల్లేడు వలనం గాసరోగము తగ్గుచున్నది. ఉమ్మెత్త వలన నుబ్బసమునకు వడిమఱలు చున్నది. బల్ రక్కసి వలన దేలు బాధ పోవుచున్నది. నాభివలన జ్వరము హరించుచున్నది. తుదకు మనకాలి క్రింద మట్ టివలన జరుగుచున్న లోకోపకార మింతంతకాదు. ఇట్టి నిర్జీవ పదార్దములవలన బ్రపంచమునకు మేలు జరుగుచున్నట్టే జీవపదార్థముల వలనఁ గూడ జరుగుచున్నది. స్వభావసిద్దముగ మాత్రమే జరుగుచున్నది. ఉద్దేశపూర్వకముగ జరుగుట లేదు. లేదు. కావున సాక్షిశాల మనశాల కంటె భిన్నముకాదు. ఆశాలా నిర్మాణమునకు, మన Saloon మార్గదర్శిని యని చెప్పక తప్పదు. సాకి మనకు జన్మసోదరుడే కాక వ్యాపార సోదరుడు కూడను. ఆసంఘ ప్రధానవక్తయగు జంఘాలశాస్త్రిని మనసభ కధ్యక్షునిగా నియమించు కొనుట మిక్కిలి ప్రశస్తము. సభవారి పక్షమున నే నీయుపపాదన మొనర్చుచున్నాను. అంత సభలోఁ గరతాళధ్వనులు.

తరువాత నొక్కడు లేచి యుపపాదనమును బలపఱచెను. నేను గరతాళధ్వనులన డుమ నధ్యక్షపీఠ మెక్కితిని. ఒక్కడు వచ్చి నా మెడలోఁ బుష్చమాలిక వైచెను. మఱి యొకఁడు వచ్చి నాచేత నొక కార్యక్రమపత్ర ముంచెను. నేను వినమ్రుడ నైలేచి యిట్లంటిని.

సోదరులారా! పాలలో మీగడయెట్లో చిన్నవూదేనిలోఁబలుకులెట్లో యాంధ్రక్షురక మహామండలిలో మీరట్టి యుత్కృష్ణులైనవారు. ఇది వసంతర్తవగుటచే నొక్క మంగలిదర్శ నమగుటయే మహాదుర్లభమై యుండ, నిందఱ దర్శన మయాచితముగ నగుట యనర్హుడ నగు నాపుణ్యమే కాక యఖిలాంధ్ర దేశపుణ్యమని చెప్పిన నతిశయోక్తి కాదు. ఆంధ్రసారస్వత చరిత్రలో నీదినచర్య సువర్ణాక్షరములతో లిఖింపఁబడఁదగినది. ఈసభలో నెందఱో క్షురకవిద్వాంసు లుండ నెందఱో క్షురకోద్యోగులుండ, నెందఱో క్షురక కవు లుండ నెందఱో క్ క్షురవక్తలుండ, క్షురకుఁడనుగాని, నాకీగౌరవము లభించుబ యాంధ్రశారదా చరిత్రలో నద్వితీయమగు నంశముగనుండఁగలదు. అంబష్టజాతికంతకు నాయందుఁ గల యవ్యాజాభి మానమును బట్టి చూడగా నేను పూర్వజన్మమున మంగలినై యుందు నేమో యని యనుకొన వలసి వచ్చుచున్నది. (సభలో కరతాళధ్వనులు) లోకమున నకారణాభిమాన