యదయ్యా యని యాతండు ప్రత్యుత్తర మిచ్చెను. అయ్యా! ఈయూరిబయట జరిగిన భారత యుద్దమునుగూర్చి నీ వెఱుఁగనే యెఱుఁగవా యని యడిగితిని. "నిన్నగాక మొన్నజరిగిన వ్యాపారమే మఱచిపోదుముగదా. యెప్పడో జరిగిన యుద్దముమాట యెవనికి జ్ఞప్తిలోనుండునయ్యా యని నాకు సిగ్గువచ్చునట్టాతడు మందలించుచు బదులు చెప్పెను. పోనీ మీయింటలో నాకీదినమున భోజనము పెట్టుదురా యని యడుగ నేను వృత్తిచేత వంటవూడివాండను గానున్నను నొక్కరూపాయినిచ్చినయెడల నాభార్యతోఁజెప్పి యీయు పకారము చేయింపఁగల నని యాతండు పలికెను. ఆతని యింటికిఁబోయి స్నాన మొనర్చి భుజించి మోటారు బస్సును మాటాడుకొని యుద్ధభూమి కేంగి శ్రీకృష్ణభగవానుఁడు పార్థునకు జ్ఞానోపదేశమొనరించిన స్థలమేది యని యడిగి తెలిసికొని యచ్చట నిలువఁబడి తిని.
ఆస్టలము కొంచె మెత్తుగా నున్నది. అచ్చట నొక్క మండపమున్నది. దానికి వెనుకభాగమునందుఁ జిన్నచెఱువున్నది. ఆచెఱువు నీటితోడనే రథాశ్వములను భగ వంతుఁడు కడిగినాఁడని యచ్చటి జలముతెచ్చి యొకముసలిది నాపై గొంత చల్లెను. రెండుడబ్బులిచ్చి యామెను వదల్చుకొంటిని, భూమ్యాకాశములు గలయువఱకు నొక్కటేబయలు భయంకరముగ గనబడుచున్నది. చిన్న కంకరజాలు, చికిలింతదుబ్బులు బల్ర క్కసి కంపలు జిల్లేడుమొక్కలు మొదలగునవి విరళముగ నున్నవి. చూపున కడ్డువచ్చు నొక్కనిలువు పాటిచెట్టయినను లేదు. అది యెండకాలమగుటచే నెండమావుల ప్రవాహములు మిక్కుటముగ నున్నవి. పిట్ట పీచు మనుప లేదు. గాలియైన గట్టిగ వీచుటలేదు. భయంకరమగు నిశ్శబ్దతావస్త్ర ప్రబలియున్నది. శ్రీకృష్ణభగవానుని బ్రార్థిం చి యాపవిత్రస్థలమునకు సాష్టాంగపడితిని.
ఇదియేనా కురక్షేత్రము? ఇదియేనా మహావీరుల మహాస్త్రముల మహాజ్వాలలచే మండి పోయిన భండనరంగము? ఇదియేనా పనునెనిమిదక్షౌహిణుల రక్తముల దడిసిన ప్రదేశము? ఇదియేనా భీష్ముడంపశయ్యపై బండుకొని ధర్మబోధన మొనర్చిన పవిత్రస్థలము? ఇది యేనా పార్థవ్యాజమున భగవంతుఁడు ప్రపంచమున కంతకును ప్రజ్ఞాప్రదాన మొనర్చిన దివ్వక్షేత్రము? బంగరుగని యొకగనియా? వజ్రములగని యొకగనియా? శాసనములగని యొకగనియా? విగ్రహములగని యొకగనియా? రత్నాకరమొక రత్నాకరమా? జ్ఞానధన మెటనుండి యుద్బుద్దమై ప్రపంచమంతయు వ్యాపించినదో యట్టి కురుక్షేత్రఖనియే ఖని.
నేనొక పాదుషా దివాన్ ఖానా జూచితిని. అది పాలఱాతిదూలములతోఁ బలకలతో వాసములతో నిర్మింపఁబడినది. ఎదుట నెన్నియో దివాన్ ఖానాలు నాకుఁ గనబడుచున్నవి. ఈ ప్రక్క నాప్రక్కను వెనుకగూడ నెన్నియో శాలలు గనబడుచున్నవి. ఈశాలల పొడువు నకు వెడల్పునకు హద్దే కనబడుకుండ నున్నది. లెక్కలేనన్ని నాస్వరూపములు నన్నుఁ జూచి వింతపడుచున్నవి. శ్రీరామచంద్రమూర్తి గాంధర్వాస్త్రమును విడిచినప్పడు యుద్ద సీమయంతయు నామయము నైనట్లు కనబడుచున్నది. నేను ముందునకుఁ బోవ నేనే నన్నెదుర్కొనుచున్నాను. మనస్సునకుఁ గలతగనుండి వెనుకకుఁ బోవ నాస్వరూపము నన్నే వెంబడించుచున్నది. మయసభలో నీరు లేనిచోట నీరున్నట్లు నీరున్నచోట నీరులే నట్టు భ్రమ గలుగుచుండెనను మాట జ్ఞప్తికి వచ్చినది. నీరున్నను లేకున్నను నీరున్న స్థలమని