Jump to content

పుట:SaakshiPartIII.djvu/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆతఁడు కరకర లేచుచున్నాఁడు; నేను జర జర నడచుచున్నాను. సూర్యోదయము కాకమునుపే స్నానముచేసి, యర్ఘ్యప్రదాన మొనర్చి, సూర్యనమస్కారము లాచరింపవలసిన నేను దంతాధవన మైన లేకుండ సూర్యునివైపుదిరిగి చెంపలు గొట్టుకొనకుండ, మూట చేతఁ బట్టుకొని, మునిఁగిపోయిన ట్లూరిలోనికిఁ బోవుచున్నాను. సవితృమండలదర్శన మొనర్చి మనవేదర్షు లాతేజోవైభవమునకు, నాతమశ్చటా విచ్చేదన సామర్ధ్యమునకు, నా సర్వమాలిన్య నివారణమహనీతయకు, నా యారోగ్యప్రదాన ప్రవీణతకు, నన్నింటిని మించిన యాహృదయ తాపాపహరణశక్తికి, నాత్మవికాసశక్తికి వింతపడి, యొుడ లంత చూపుగ జేసికొని, యాచూ పంతయు మనసుగఁ జేసికొని, యామన సంతయు నాత్మగఁ జేసికొని, యా యాత్మ నంతయు బరమార్ధ జ్ఞానసంపన్న మొనర్చుకొని కవులై, భక్తులై, గాయకులై, విరాగులై, వేదాంతులై యెన్నివేల సంవత్సరముల క్రిందటనో పాడినపాటలు, చేసిన నృత్యములు, వెదచల్లిన తత్త్వములు, భారతదేశమున కిచ్చిన వెలుఁగే కాదా? ప్రపంచమునం దంతయు నిప్పటివఱకుఁ నిలిచి, సృష్టి పోయినను నిల్చునది యాతేజ మొక్కటియే యైనట్టు చెప్పక చెప్పచున్నదే. ప్రకృతిలోని తేజస్సుముద్రమును, సౌందర్యరాశిని, శక్తిసంపన్నతను, మహామహిమ విశేషమును గాంచి, యద్బుతపడని వాఁడు పనికిమాలిన పందలలోఁ బ్రప్రథముఁడు. చూడఁదగిన వస్తువును జూచి శిరఃకంపనము చేయనివాఁడు పశువుకంటె నధముడు. ఆశ్చర్యపడుట యనుశక్తి మనుజశక్తిలలో ముఖ్యమైనది. ఆశక్తినుండియే యెంతఙ్ఞాన విజ్ఞానములైన నుదయించినవి. సర్వదేశసర్వ కాలసర్వవిధ సారస్వతములకం తయు నాశక్తియే మూలము. హృదయమునందుఁ దఱుగు మిఱుగులేని రసోద్రేక మున్నవానికిఁగాని యాశక్తి యుండదు. అట్టిశక్తి యున్నవాని మెప్పే మెప్ప. నవ్వే నవ్వు. ఏడుపే యేడ్పు. బ్రదుకే బ్రదుకు. గగనమందుఁ గన్నులవైకుంఠముగఁ గ్రాలు బంగరుచట్టు జలతారు నీలిచీర సింగారించిన ప్రకృతి యువతిచేతిలోని సప్తమణి వినిర్మిత చాపమును గాంచి చేతు లెత్తి గంతులువైచి యొడలు తెలియని యానందమున మత్తిల్లువాఁడే మనుజుఁడు. కాలిక్రిందం బ్రమాదవశమునం బడిన చీమ దేహాత్మావిచ్చేదనసమయమున నిచ్చినమూల్గు సింహగర్జనమువలె నాకర్ణించి కడుపుపగిలి కండలు కంపించునట్లు గాఢముగ నేడ్చువాఁడే మనుజుఁడు. అంతేకాని పట్టుమని తినలేక, యెంగిలిలంఘనములు చేయుచు, నొడలు తెలియనినిద్ర పోలేక యులికి యులికి యేడ్చుచు నేదైన వింతవస్తువును గాంచి వింతపడి 'హాయి హాయి’ అని మఱవలేక తల కదలించి కదలుపనట్లు నోరు మెదలిచి మెదల్పనట్టు లేదో కొండనాలుకకు వెనకు గొణఁగుకొనుచు, నత్యంత ప్రియమైన వస్తువు జాలకిపోయినను గాలిసయితము విని గడగడలాడున ఫ్రేడువలేక కుక్కపిల్లవలె కుంయు కుంయు మని వినఁబడి వినఁబడకుండునట్టు లేడ్చుచు, భోజనమునొద్ద షండులై పొలతియొద్ద షండులై పుస్తకము నొద్ద షండులై యానందానుభవమున షండులై దుఃఖానుభవమున షండులై చావకుండ జచ్చియున్నవ్యర్డులు బానిస లీప్రపంచమున దాస్యమును, నీచతయు, నజ్ఞతయు, రోగ మును, చచ్చుటకుఁ దప్ప వేఱుకార్యమున కక్క ఆకురాని జనాభాను వృద్ది పఱచుటకును, దక్క మఱియెందులకు?

ఇట్లు పూర్వస్థితిని స్మరించుకొని సంతసించుచు, నిప్పటిస్థితిని స్మరించుకొని విచారించుచు, ముందునకు నడుచుచుంటిని. అచ్చటనొక్క బ్రాహ్మణునిజూచి యిచ్చటికి యుద్దభూమి యెంతదూరమున్నదని యడిగితిని. యుద్దభూమిసంగతి నాకేమియు దెలి