పుట:Rubayat.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

58

నిన్న కల్లంగడికి ముందట
కన్ను చీఁకటిలోన వెలుఁగుచు
నన్ను డాసెను మద్యపాత్రను

చేతఁబట్టికొని

చిన్నదొక యప్సరస యదియును
తిన్నగా నాముందు నిలిచియు
‘అన్న ! దీనిని చూతునా రుచి'

యనుచుఁ బ్రశ్నించెన్


59



ఓయి ద్రాక్షఫలంబు గొప్ప
న్యాయశాస్త్రమునందు నిధిసుమి
పాయు దానను కలహములు మన

దేశమందెల్లన్.

ఈయదియు రసవాదమందు న
మేయకౌశలమొప్ప జీవము
హేయమయిన నమూల్యమౌనటు

చేయఁజాలుఁ జుమీ,

30

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/36&oldid=322215" నుండి వెలికితీశారు