పుట:Rubayat.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



56

ఒప్పుగా సదసద్వివేకము
మెప్పు పొందింపంగ, తత్త్వము
నొప్పుకొనఁగా, హెచ్చుతగ్గుల

నేర్పఱించితిని.

ఒప్పుతప్పు లవెల్ల నేటికి
గొప్పగా మధురసవివేకమె
గొప్పశాస్త్రమటంచు దాని

లోతుఁజూచితిని,



57


గణితశాస్త్రమునందు మేటివి
అని జనులు నిను మెచ్చుకొందురు
గణితశాస్త్రమునందు నీకును

ప్రజ్ఞయేమొ కదా.

అనుచుఁ దెలియఁగ నడిగెదవు, ఱే
పనెడి దొక్కటి, నిన్నయొక్కటి
వినుము పంచాంగముల లేవని

చాటుటయె ప్రజ్ఞ,

29

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/35&oldid=322214" నుండి వెలికితీశారు