పుట:Rani-Samyuktha.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


దానితోనే పొడుచుకొని తానును మరణంబు నొందెను. అంత కొంత తడవునకు వినయశీలుఁ డేతెంచి రెండు కళేబరములఁ జూచి శోకమున “హా! ఇదియేమి ! నేను నిక్కముగ నావారి కళేబరములఁ జూచుచున్నానా ? లేక నాకేమైన భ్రమ చేకూరినదా ? హా ! జయచంద్రా ! నీ కీదుర్మరణం బేలకల్గె ! హా! నెచ్చెలీ : దేవశర్మా : ఇప్పుడేకదా మమ్మటుబంపి నీ విటువచ్చితివి? ఇంతలో నింతఘోరమా ! హా ! నీవు యమునంబడిన నాటఁగోలే నేటివరకు గాంచినకృత్యముల దెల్పి యవి మన జయచంద్రునకు దెల్ప నేతెంచితిమిగదా ? కట్టా ! నీ సాహస కృత్యముల బరలోకమందైన నెఱిగించెదగాక" యని పోయితివా? నేనుమాత్ర మేలవినకుండవలయు. ఇదిగో నేనును వచ్చుచున్నాడ నని తనదగ్గరనున్న కత్తితో బొడుచుకొని ప్రాణమువదలెను. కొంతతడవునకు గంచుకి చనుదెంచి మూడు శవములవీక్షించి భయోపేతుడై రోదసము సేయుచు నట మండుచున్న యొకకాష్టముపై కురికి మృతుఁడయ్యెను. అట ఢిల్లీ నగర మందున్న మంజరి జరిగిన వార్తలన్నియు విన్న వెంటనే దుర్గమందున్న నేనను గోరీని నెదురింపబంపి యనంతరము పురమునంగల యంగననెల్ల రావించి వారితో సాధ్వీమతల్లులారా ! కన్న బిడ్డలంబలె మనల బోషించుచువచ్చిన రాజదంపతు లిరువురు మృతినొందినపిదప మనము జీవించియున్న ప్రయోజనం బేమి ? మఱియు గోరీ మనపురంబున కేతెంచుచున్నాడట. మ్లేచ్ఛులచే జిత్రహింసపడుటకన్న వేరుమార్గముల మృతినొం

240