పుట:Rani-Samyuktha.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముప్పదియొకటవ ప్రకరణము


దుటమేలు ? అదియుంగాక నా ప్రియసఖియగు సంయుక్త తాను మరణించినతరుణమున " చెలీ ! మంజరీ ! ఒకవేళ నానాథున కపజయంబైన ఢిల్లీపురకాంతల మానభంగముగాకుండ రక్షించు భారము నీదేసుమా " యని సందేశ మంపియున్నది. ఇత్తరి మిమ్మట్లురక్షింప నాకు వేరొండువెరవు గన్పించుటలేదు. గోరి వచ్చులోపల జితులం బేర్చుకొని యగ్నినిడుకొని వానిపైబడి మృతినొంది మీమర్యాదల గాపాడుకొను " డన నందఱు శోకాక్రాంతలై యాక్రందనముల జేయుచు మంజరి దారిఁజూప దామును బ్రాణములబాసి స్వస్థనొందిరి. సుల్తాన్ మహమ్మద్ గోరీయు దన్నెదురింప వచ్చినసేనల నవలీల నుక్కడిఁచి రాజుధానింజేరి దుర్గపుదలుపులు తెరువబడియుండుటచే నే యాటంకములులేక లోపల బ్రవేశించి పురమున నెక్కడ జూచినను భస్మరాసులుంట కాశ్చర్యకలితుఁడై యార్యకాంతల సొహసమునకు మెచ్చుకొనుచు నన్ని కడల బాగుసేయించి మహమ్మదీయ రాజ్యము స్థాపించెను.


సంపూర్ణ ము.

241