పుట:Rangun Rowdy Drama.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాంకము.

75

జయ – జీ సేట్ మహరాజ్ ! హుకుం కా మాఫిక్ (రామాయణము తెచ్చి చదువును.)

ద్విపద.

హనుమంతుఁ డావేళ అంబుధిదాటి
ఘనమైనలంకలో కాలుమోపఁగనె,
రాక్షసుల్ భీకరారవములతోడ
భక్షింతు మని వాని పైఁబడరాగ
భూతముల్ దయ్యముల్ బొబ్బల నిడుచు
క్రోతిపై డీకొని గొంతుక పిసుక--

గంగా - హే ! ఉండుండు, అట్టే చదువకు.

జయ - క్యా హై మహరాజ్ !

గంగా - కుచ్ నహీ మహరాజ్ ! అరే బాప్రే! బాప్! రామాయణం విందామన్నా రాకుసులూ దయ్యాలేనా!

జయ – రామాయ న్మే సొబ్ అయిసా హైనా సేట్‌సాబ్ !

గంగా -- ఏదైన శృంగారమున్నభాగం చదవ్వోయి !

జయ - ఇస్మే కహాఁ మిలేగా సింగారం ?

గంగా - అయిసాహై తో రామాయణ్ ఛోడ్ దేవ్'. మహాభారత్ పఢో.

జయ - జీ!

(మహాభారతము తెల్చి చదువును.)

ద్విపద.

అపుడు కీచకుఁడు మోహావేశమంది
అపురూపసుందరియైన సైరంధ్రి
మొగమునుఁ జూచి సమ్మోహితుండయ్యె
విగతధైర్యుండయ్యె విరిశరాహతుల
అతఁడు సైరంధ్రితో నతిప్రేమ మీఱ
కుతుకాన రమ్మంచుఁ గోరికఁ దెలిపె