పుట:Rangun Rowdy Drama.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

రంగూన్‌రౌడీ.

    సన్యసించిన నాకు శస్తభూషణలేల ?
                  రుదురాకపేరులే కుదురుఁగాని
    తపసినౌ నాకు మదనమంత్రజపమేల?
                  నారాయణస్మరణంబెకాని

గీ. కరమునందాల్ప నాకు శృంగార మేల?
    పూజితంబైన జపమాల పోలుఁగాని
    ఇన్నిటి నెఱింగి యీశ్వరుం డిట్లు సేయ
    వగవ నేల? నానందింపఁ దగును గాని.

బట్ల - (ఒకచీరతో ప్రవేశము.)

ప్రభా - నాయనా ! నీయజమాని నవిన్నపమును మన్నించెనా ?

బట్ల - మన్నించెను. నీవు ధరియింప నీచేలమునుఁగూడ పంపెను. దీనిని మేనఁదాల్చి దానిని నాకిమ్ము. (ఇచ్చును.)

ప్రభా - (కైకొని కన్నుల కద్దుకొని) నాయనా ! ఇప్పటియవస్థ కీచేలమే నాకు మిక్కిలి యర్హమైనది. భగవంతుఁడే దీనిని నీమూలమున నాకు దయచేసినాఁడు. నీకు చిరాయుష్యము గల్గుఁ గాక

(చీరను గొని చాటున కేగును.)

( తెరవ్రాలును.)

రంగము. 2.

స్థలము:- గంగారాంసేట్ గృహము.

[గంగారాముఁడు రక్ష రేకులుగట్టుకొని కుర్చీమీద పండుకొని ]

గంగా - దర్వాన్ !

జయ - హాజర్ మహరాజ్ !

గంగా - ఈదయ్యాలభయముచేత నాకు నిద్దురలోగూడ దయ్యాలే కనఁబడుచున్నాయి. కొంచెం మనస్సు శాంతంగా ఉండడం కోసం రామాయణం చదువుతావా?