ఉపరూపకాలు
ప్రహసనాలకు ఉదాహరణ: భగపదజ్ఞకరము, మత్తవిలాసము, లటకమేశకము.
డిమము: ప్రఖ్యాతేతివృత్తము ధీరోద్ధతులగు దేవ గంధర్వ పిశాచాదులు పదహారుగురు నాయూకులు. రౌద్రము ప్రధానరసము. నాలుగు అంకాలు, మాయ, ఇంద్రజాలము, యుద్ధము, సూర్యచంద్రగ్రహణాలు వర్ణితాలు.
ఉదా|| త్రిపురదాహము, వీరభద్ర విజృంభణము.
వ్యాయోగము: ప్రఖ్యాతేతివృత్తము. ధెరోదాత్తనాయక సమన్వితము, వీరసర ప్రధానము, ఏకాంకము. స్త్రీనిమిత్తముకాని యుద్ధము వర్ణితమవుతుంది.
ఉదా||నరకాసుర విజయ వ్యాయోగము, కిరాతార్జునీయ వ్యాయోగము.
నమవాకారము: ప్రఖ్యాతమైన ఇతివృత్తము. దేవదానవులు పండ్రెండుమంది నాయకులు, వీరరసము,, మూడు అంకాలు. ప్రదర్శించడానికి మూడు యామాల కాలముపట్టే కధాభాగము.
ఉదా|| సముద్రమధనము (నం). రంగరాయకదననమవాకారము(తె).
వీధి: కల్పితేతివృత్తము, ధీరోదాత్తనాయకము, ఏకాంకము, శృంగారరస సూచన, ఒకటిరెండు పాత్రలు.
ఉదా||మాలతీవీధి, ప్రేమాభ్ణిరామము (నం.), చిత్రకధవీధి, క్రీడాభిరామము (తె).
అంకము (ఉత్పృష్టికాంకము): ప్రఖ్యాతేతివృత్తంగాని, కల్పితేతివృత్తంగాని ఉండవలె. ప్రాకృతమనుజనాయకము, కరుణరస ప్రధానము. స్త్రీవిచారము, వాగ్యుద్ధము ముఖ్యంగా వర్ణింపబడవలె. ఏకాంకము.
ఉదా|| శర్మిష్టాయయాతి, ఉన్మత్త్తరాఘవము.
ఈహామృగము: ఇరివృత్తముమిశ్రము. ధీరొద్ధతులైన పరదివ్యులు నాయక ప్రతినాయకులు, అనురాగములేని దివ్యస్త్రీలను బలాత్కరించటం ముఖ్యము. వీనివల్ల శృంగారరసాబాసము కలుగుతుంది. అంకాలు నాలుగు. నయక ప్రతినాయకుల యుద్ధము వర్ణితముకావలె. వధ త్యాజ్యము.
ఉదా|| రుక్మిణీ హరణము, వెరవిజయము.
ఉపరూపకాలు
ఉపరూపకాలు పద్నాలుగని కొందరు లాక్షణికులు, పదునెనిమిద్