Jump to content

పుట:RangastalaSastramu.djvu/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంస్కృత రూపలక్షణము

భక్తిని భక్తిరసమని కొందరు లాక్షణికులు ఇంకోరెండురసాలను అధికంగా పేర్కొన్నారు.

దశరూపకాలు

నాటకము: దశరూపకాలలో శ్రేష్టమైనదిగా పరిగణించబడుతున్న రూపకభేదము నాటకము. ఇందు ఇతివృత్తము ప్రఖ్యాతము. ధీరోదాత్తుడు నాయకుడు. శృంగార వీరరసాలలో ఒకటి ప్రధానరసము. (కరుణరసము కూడా ప్రధానరసము కావచ్చునని భవభూతి మతము). అయిదుమొదలు పదివరకు అంకాలు. ముగింపు అద్భుతావహంగా ఉండవలె. ఉదాహరణకు దుష్యంతుడు, రాముడు నాటకాంతంలో తమతమ కుమారులను తెలుసుకోవడం: బాహుకుడు కలి వేసిన వస్త్రము ధరించి పూర్వనలరూపము దాల్చడం.

నాటకానికి ఉదాహరణలు: అభిజ్ఞాన శాకుంతలము, మహావీర చరిత్రము.

ప్రకతణము: కల్పితమైన ఇతివృత్తము. ఎక్కువగా సాంఘికము. ప్రధానరసము శృంగారము. ధీరశాంతుడు నాయకుడు. అమాత్య విప్ర వైశ్యులలో ఎవరైనా నాయకుడు కావచ్చు. సంసారస్త్రీ కాని, వేశ్యగాని, ఇరువురు నాయికలు.

ఉదా||మృచ్చకటిక, మాలతీమాధవము(నం), వ్చరవిక్రయము (తె).

బాణము: కల్పితమైన ఇతివృత్తము ధూర్తచరితము. ఏకాంకము. ఏకపత్రయుతము. శృంగారవీరరసముల సూచన.భారతీతీవృత్తి, ఆకాశభాషితము, గేయ పదములు కూడ దీనిలో ఉపయుక్తమవుతాయి.

ఉదా||శృంగారమంజరి, లీలామధుకరము.

ప్రహసనము మూడువిధాలు - 1.శుద్ధము, 2.వికృతము, 3.సంకీర్ణము. శుద్ధము శాక్యులు, బ్రాహ్మణులు, గురువులు, భిక్షువులు మొదలగువారి హాస్యచరితము. చేటీ చేటవిటాది ప్రయుక్తము.

'వికృతము ': కంచుకి, శండ, తావస, వృద్ధాదులు--విట, చార, భటాదుల భాషలు కలిగినవారుగా వర్ణితమగునది.

సంకీర్ణము; చోరులు, జూదరులు మొదలగు ధూర్తుల చరితము కలది.