పుట:RangastalaSastramu.djvu/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రతీకవాదము

స్టాన్ల్స వస్కీ, దాన్ షెంకోలు కలిసి ప్రారంభించిన "మాస్కో ఆర్క్ దియేటార్" లు స్వతంత్ర నాటకోద్యమాలను నడిపి చాలాకాలంపాటు తమ ప్రభావాన్ని ప్రపంచ నాటకరంగంమీద ప్రసరింప చేసినవి.

ఆంటోయిన్ ప్రారంభించిన రంగాలంకరణవిధానము, స్టాన్ల్సస్క్త్త్ ప్రతిపాదించిన నటసూత్రాలు ముఖ్యంగా చెప్పుకోతగ్గవి.

ఇవిగాక జర్మనీలో మాక్స్ డీన్ హార్ట్ ప్రారంబించిన కలాత్మక స్వబావవాదము (artistic realism) కూడా పేర్కొనదగిన ఉద్యమమే. ఈ ఉద్యమంలో రీన్ హ్జార్ట్ నాటకప్రయోగంలో దర్సకునకు ప్రధానమైన స్థానమిచ్చినాడు.

పైన పేర్కొన్నవన్నీ ఏదోవిధంగా స్వబావవాదాన్ని అసురించి వాస్తవిక జీవితాన్ని ప్రతిబించడానికి ప్రయత్నించినవే.

స్వభావవాదంపై తిరుగుబాటు

నేటివరకు వచ్చిన నాటకసిద్ధాంతాలలో ఈనాటివరకు ప్రచారంలో ఉన్న స్వాబావికవాదానిదే పైచేయి. అయినప్పటికీ, దానికి ప్రతిగా కొన్ని తిరుగుబాటు ఉద్యమాలు బయలుదేవినవి. వాటిలో ముఖ్యమైన ప్రతీకవాదము (Symbolism), అభివ్యక్తివాదము (Expressionism), ఎపిక్ నాటకోవ్యమము (Epic Theatre).

ప్రతీకవాదము (Symbolism)

ప్రతీకవాదానికే నూతన కాల్పనికోద్యమమనీ, ఇంప్రెషనిజం అనీ కూడా పేర్లున్నాయి. పంఛేంద్రియాలద్వారా మాత్రమే మనము గ్రహించగల హధార్ధాన్ని చిత్రీకరించవలెనన్న స్వభావవాదాన్ని ప్రతిఘటిస్తుండి ప్రతీక వాదము. కార్యకారణ సంబంధాన్ని వ్యతిరేకిస్తూ, దానికి ప్రతిగా అనుభూతికి ప్రముఖస్థానమిస్తుంది. చరమనత్వాన్ని తార్కికంగా అర్ధముచేసుకోలేమనె, దానిని తర్కబద్ధమైన బాషలో వ్యక్తము చేయలేమనీ-నిర్ధారించుకొన్న ప్రతీకాత్మక నాటకరచయిత తాను యదార్ధమని నమ్మినవారిని కొన్ని ప్రతీకలద్వారా చిత్రిస్తాడు.

ప్రతీకరూపకాలలో మానవుల చేష్టలే ప్రతిబింబించినా, అంతకుమించిన అంతరికమైన సత్యాన్ని పాత్రలద్వారా, సంభాషణలద్వారా వెలువరించడమే రచయిత అంతిమలక్ష్యము. దానిని కేవలము మాటలలోనే కాక కొన్ని ప్రతీకలద్వారా కూడా వెలువరించడమే ఈ రూపకాల ధ్యేయము.