పుట:RangastalaSastramu.djvu/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆధునిక నాటకరంగము

నాటకాలలో సమాజానికి బదులు వ్యక్తిని, కేవలము యధార్ధచిత్రణ స్థానే ప్రతీకచిత్రణలను చూపినా, ఇబ్సన్ తరవాతితరాలవారికి వాస్తవికనాటక రచయితగానే గోచరిస్తాడు.

ఈ సిద్ధాంతాన్ని అనుసరించినవారిలో వివిధదేశాల నాటకరచయితలు ఉన్నారు. ఇంగ్లండులో పెనెరొ, గాల్స్ వర్ధీ, జోన్స్, బెర్నార్డుషాలు ఈ వర్గంలో చేర్చదగిన ప్రముఖ రచయితలు. ఇబ్సన్ అనుయాయులతో షా, ప్రముఖుడు. అయితే ఇబ్సన్ గంభీరతాప్రధ;అనమైన నాటకాలను (Serious Plays) వ్రాస్తే, షా వ్యంగ్యప్రధానమైన నాటకాలను వ్రాసినాడు. అయినా సమాజశ్రేయస్సును, మానవుల ప్రవర్తనను దృష్టిలో ఉంచుకొని నాటకాలువ్రాయడంలో షా తన గురువైన ఇల్సన్ నే అనుకరించినాడు.

వాస్తవికతావాదాన్ని అనుసరించి నాటకాలు వ్రాసిన రచయితలలో రష్యనులుకూడాల్ ప్రముఖులే. నికలాయ్ గొగోల్, ఇవాన్ జర్జనేష్, ఆంటన్ చెకోవ్ లు ఇక్కడ పేర్కొనదగినవారు. చెకోవ్ వ్రాసిన The Sea Gull, Uncle Vanya, Cherry Orchard; గొగోల్ వ్రాసిన Inspector General; బర్జనీన్ వ్రాసిన A Month in the Country చెప్పుకోతగ్గవి.

స్వాభావికతావాదము (Naturalisam)

ఒకపక్క వాస్తవికతావాదము నిలొదొక్కుకొంటూ ఉండగానే, వేరొక వంక దానితీవ్రరూపమైన స్వాభావికతావాదము ప్రారంభమైంది.  "వాస్తవిక జీవితానికి యధార్దచిత్రలు" అన్న నియమాన్ని ఈ రెండువాదాలు అనుసరించినా, స్వాభావికతావాదము మరోమెట్టు ముందుకుపోయి, కళాత్మ వ్యక్తీకరణము కేవలము శాస్త్రీయ పద్ధతులద్వారానే జరగవలెనని, మానవుల ప్రవర్తన అంతా అనువంశిక(heridity) వాతావరణాల మీదనే ఆధారపడిఉంటుందనీ నిర్ధరించింది.  ఈ వాదానికి నిర్దేశకుడు ఎమీల్ జోలా, ఆంద్రీఅంటోయిన్ వ్రాసిన "The Butchers" అనే ఏకాంకిక ఈవిధంగా వ్రాసిన నాటైకాలలో మొదటిది.  జోలా వ్రాసిన ధెరిస్ రాక్వి న్, హెంరీచెక్ వ్రాసిన The Vultures అనేవి ఈ కోవకు చెందిన ప్రముఖనాటకాలు.

కొన్ని ప్రత్య్హేక నాటకోద్యమాలు

పారిస్ లొ 1880 ప్రాంతాల ఆండ్రీ ఆంటోయిన్ ప్రారంభించిన దియేటర్ లిబర్ (Theatre Libre), 1898లో రష్యాలో కాన్ స్టాంటిన్