పుట:RangastalaSastramu.djvu/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆహ్లాద రూపకము

నృత్యం నుంచి కామెడీ ఆవిర్భవించినదని అరిస్టాటిల్ అభిప్రాయము. ఈ ఊరేగింపులో పాల్గొనెవారు జంతువుల వేషాలు వేసుకొనేవారనీ, అందువల్ల దానికి కమెడీ పేరువచ్చినదనే కొందరు అభిప్రాయపడుతున్నారు.

విమర్శకులు కామెడీలను పురాతన (Classical), మధ్యకాల (Middle), నవీన (New) కామెడీలుగా విభజించినారు.

పాత కామెడీలలో ఇతివృత్తమెక్కువగా స్థానికవిషాలకు సంబందించినది. నగర జీవితంలోని విషయాలనుగాని, వ్యక్తులనుగాని, భావాలనుగాని, రాజకీయాలనుగాని నిర్మొహమాటంగా అవహేళన చేయడం పాత కామెడీలలో ప్రాధాన్యము వహిస్తుంది. ఈ రకంరూపకాలు విమర్శ, అవహేళన, చమత్కారము, అసభ్యభాషణ, వికటత్వము, దూషణ, సంగీతాల మిశ్రమరూపాలు.

పాతకామెడీలలో బృందగాయకులు ముందుగా ప్రవేశిస్తారు. వీరికి నటునితోగాని, ఇద్దగు నటులతోగాని వివాదము చెలరేగుతుంది. చర్చ జరుగుతుంది. తుదకు బృందగాయకులు ప్రేక్షకులతో మాటాడతారు. వీటిలో ఒకే ఒక సన్నివేశాన్ని తీసుకొని దానిని పెంచి, ఒకదానితో ఒకదానికి ఎక్కువ సంబంధం లేని రంగాలుగా రూపొందించడం సామాన్యంగా జరుగుతూ ఊంటుంది. నాటక కర్త నాటకభ్రమను వదలివేసి స్వీయవిషయాలను ప్రేక్షకులతో మాటాడతాడు. వీటిలో సాంఘికదురాచారాలను పరిహసించడం పరిపాటి.

మధ్యకాలపుకామెడీలో పాతకామెడీలక్షణాలు ఎక్కువగా గోచరిచవు. కేరింతలు గొడవలుండవు. వీటిలో బృందగాయకుల ప్రాధాన్యము తక్కువ. నాటక భ్రమ (dramatic illusion) కు ప్రాధాన్యము హెచ్చు. వీటిలో స్త్రీ పురుషసమానభావవాదాన్ని అవహెళన చేయడం పొడగడుతుంది. వ్యక్తి దూషణ రగ్గింది. రాజకీయనాటకంగా కాక కేవలము సాంఘికనాటకంగా రూపొంఎదింది. కధావిన్యాసంలో పరిణామము గోచరిస్తుంది. సాంఘికజీవితము రూపక భూమిక అయింది.

ఉదా:- పార్లమెంటులో స్త్రీలు భాగ్యదేవత.

నవీన కామెడీలోకోపిష్టివృద్ధు, ప్రతివిషయంలో కలుగజేసుకునేబానిస, అనాధబాలిక మొదలైన రూఢిపాత్రలు, సాంప్రదాయిక కధావిన్యాసము ఎక్కువగా కన్పిస్తాయి. ఇవి గృహ వాతావరణాన్ని చిత్రించే హాస్యనాటకాలు. బృందగానానికి కధకు సంబంధము ఉండదు. కొన్ని నాటకాలలో బృందగాయ