పుట:RangastalaSastramu.djvu/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొన్ని ప్రసిద్ధ గ్రీకు ట్రాజెడీలు

1.ఇస్కులస్ (Aeschylus) రచనల; ఆగమెన్నున్ రూపకత్రయము (Agamemnon Trilogy), సప్లయన్ ట్స్ (Suppliants), ప్రొమిధియస్ బౌండ్ (Prometheus Bound).

2.సాఫోక్లీస్ (Sophocles) రచనలు: ఈడిపస్ రూపకత్రయము (Oedipus Trilogy), అజాక్స్ (Ajax), ఎలెక్ట్రా (Electgra).

3.యిరిపిడస్ (Euripides) రచనలు: మీడియా (Media), సైక్లొప్స్ (Cyclops), హిపోలిటస్ (Hippolytus).

సాటిర్ రూపకము (Satyr Play)

సాటిర్లు అశ్వముఖలైన అరణ్యదేవతలు బృంచగాయకులు సాటిక్ లవలె వేషము వేసుకొని, తోళ్లుకప్పుకొని, తోకలు పెట్టుకొని ఆడుతూ పాడుతూ ఈ రూపకాలను ప్రదర్శింఛేవారు. కాబట్టి వీటిని సాటిక్ రూపకాలనే పేరు వచ్చింది. ఇద్ గ్రీకునాటకపోటీలలో ప్రదర్శించే విషాదరూపత్రయానికి అనుబంధరూపకము.

సాటిక్ రూపకాలలోని కధ సామాన్యంగా సాహసకృత్యాలకు సంబందించినది. ఒక్కొక్కప్పుడు విషాదరూపకత్రయంలోని నాయకులుగాని, పురాణకధానాయకులుగాని, హాస్యాస్పదమైన పరిస్థితులలో సాటిక్ ల మధ్య చిక్కుకొన్న ఘట్టము వీటిలో చిత్రితమవుతుంది. సాటిక్ రూపకాలకు, ట్రాజెడీకి రూపంలో సామ్యమెక్కువ. ఈ రెంటిలోను నిర్ధిష్ట ఘట్టాలను బృంద గేయాలు ఒక్కొక్కప్పుడు వేరు చేస్తాయి. ఒక్కొక్కప్పుడు కలుపుతాయి. సాటిక్ నాటకాల చందస్సు ట్రాజెడీ చందస్సే. అసభ్య ప్రక్రియలు. అతివేగనృత్యము, కడుపు చెక్కలయ్యే హాస్యము, అసబ్య భాషణ, అసభ్య అవయవ విన్యాసము సాటిక్ రూపకాల లక్షణాలు.

యిరిపిడీస్ రచించిన "సైక్లొసాప్స్ ", సోఫోక్లీస్ రచించిన "ట్రాకర్స్" అనే సాటిక్ రూపకఖండాలు మాత్రమే ఇప్పుడు లభ్యమవుతున్నాయి.

ఆహ్లాద రూపకము (Comedy)

"కామెడీ" అనే గ్రీకుపదానికి 'కేరింత గీతము ' అని అర్ధము. డయోనినస్ ఉత్సవాల ఊరేగింపులోని అసభ్య భాషణ, కేరింతలు, ఆటలు,