పుట:RangastalaSastramu.djvu/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9. ప్రయోగ పద్ధతులలో వైవిధ్యంతోపాటు నాటక ప్రధానోద్దేశ స్పష్టీకరణ సరళంగా నిర్ధుష్టంగా ప్రేక్షకులకు తెలిసేటట్లు జాగ్రత్తపడవలె.

10. నాటకంలో సంభాషణల ప్రాముఖ్య మెక్కువిఅనదని దర్శకుడు తోచినప్పుడు రంగ వ్యాపారము అందుకు తగినట్లు జోడించవలె.

11. ముఖ్య సంభాషణలు ప్రేక్షకులకు అర్ధపూరితంగా వినిపించేటట్లు శ్రద్ధతేసుకోవలె.

12. నటీనటులు ప్రేక్షకులందరికి చక్కగా కనిపించేటాట్లు పాత్ర సమ్మేళనము, కదలికలు రూపోందించవలె.

13. రంగష్తలంలోని అభినయావరణ పూర్తిగా వినియోగించుకొనేటట్లు దృశ్యరంగాలంకరణసమీకరణలు, రూపకల్పన మున్నగువాటిని రసాత్మంగా తీర్చిదిద్దవలె.

14. నటీనటుల ఉద్వేగ ప్రకటనలలో (emotional expression) అతిని అరికట్టవలె.

15. నటీనటులలో ప్రేక్షకులున్నారనే భావాన్ని విస్మరింపజేసి ప్రేక్షకులకోసము నటించే మన:స్థితిని పోగొట్టవలె.

16. నటనలో స్థాయిని, సమథ్టికృషిని ఉన్నత ప్రమాణాలలో నడిపించి నటీనటులు నాటకరససిద్ధికిగాక, తమ తమ గొప్పలనురకటించటానికి చేసే నటనా విన్యాసాలను అదుపులో పెట్టవలె.

17. ప్రదర్శనలో ప్రతిక్షణము నాటకగమనవేగము ఉండేటందుకు కృషి చేయవలె.

18. ప్రేక్షకోత్సాహ ప్రకటన (applause) వల్ల, నవ్వులవల్లె, నటీనటులు తమ పాత్రలనుంచి పూర్తిగా విడివడకుండా (stepping out of character) జాగ్రత్తగా ఉండేటట్లు హెచ్చరిక చేయవలె.

19. అభినయంలో, కదలికలలో, కార్యకలాపాఅ నిర్వహణలో నటీనటులు తమ కృషి, ప్రయత్నము బయటపెట్టకుండా ఎంతో నిర్లిప్తంగా, సహజంగా చేస్తున్నారనే భ్రాంతి ప్రేక్షకులకు కలిగేటట్లు ప్రదర్శన దూపొందవలె.

20. ప్రదర్శన చూడవచ్చే ప్రేక్షకాభిరుచులను దృష్టిలో ఉందుకొని ప్రయోగపద్ధతులు రూపొందించవలె.