Jump to content

పుట:RangastalaSastramu.djvu/259

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. పరాకాష్ట సన్నివేశాలు.

3. హాస్య సన్నివేశాలు.

4. ప్రేమ సన్నివేశాలు

5. కలహ సన్నివేశాలు

6. దీర్ఘ సంభాష;ణలు

7. ఎక్కువమంది నటీనటులుండే సన్నివేశాలు

మెరుగులు దిద్దటానికి కొన్ని సూచనలు

1. దర్శకుడు తన ప్రదర్శనప్రతిని పూర్వాభ్యాసానికి పూర్వాభ్యాసానికీ మధ్య చూచుకొని, ఆచరణలో పెట్టని అంశాలు వేరే గుర్తువ్రాసుకొని తర్వాత పూర్వాభ్యాసంలో నటీనటులచేత ఆచరణలో పెట్టీంచవలె.

2. దర్శకుడు ప్రేక్షకాగారంలో కూర్చుండి క్రమేణా వెనకకువెడుతూ ప్రదర్శన్మ ఫలితాన్ని--దృశ్యము, వాచికము మొదలై నవానిని చూసుకొని- సరిదిద్దుకోవలె.

3. ప్రేక్షకాగారంలోని విభిన్న ప్రదేశాలనుంచి దృశ్యరూపచిత్రము (stage picture), రంగాలంకరణ, ప్రవేశ నిష్క్రమణాలు, ప్రదీపనము మొదలైనవి పరిశీలించి మెరుగులు దిద్దవలె.

4. దృశ్యానికీ దృశ్యానికీ పరిణామము సాఫీగా జరుగుతున్నదా లేదా సరిచూసుకోవలె.

5. అభినయంలోను, ప్రయోగ పద్ధతులలోను, ప్రయత్న ప్రకటన (effort) బయటికి కనిపిస్తే అది మరుగుపరచి రూపొందించవలె.

6. కదలికలలోని ప్రవేశనిష్క్తమణాలలోను నటీనటుల భంగిమలలోను ఉండే అసహజత్వాన్నీ ఇబ్బందినీ తొలగించి ప్రేక్షక పరానుభూఇ (empathy) సక్రమంగా ఉండేటట్లు కృషిచేయవలె.

7. నాటక ప్రదర్శనలో ప్రేక్షకానురక్తికేంద్రాన్ని (audience interest point) మరల్చే అన్ని ప్రక్తియలను ఎత్తివేసి, ప్రదర్శన ప్రేక్షకానురక్తికి అనుకూలంగా తయారు చేయవలె.

8. ప్రయోగంలో అనవసరమైన వివరాలు తగ్గించివేసి, శక్తిమంతమైన ప్రదర్శనకోసము పాటుపడవలె.