మొదటిదశ
నాటక రచయిత "వ్రాసిన" పాత్రను సజీవంగా రంగస్థలంపై చిత్రీకరించే ప్రయత్నంలో, పాత్రను విశ్లేషించి చూసుమొని ఆ ఆకారస్వభావవిశేషాలు నటునిచేత ప్రకటింప జేయటం దర్శకత్వ విధులలో ముఖ్యమైనది. ఈ స్వభావ విశేషాలు సమగ్రంగా తెలుసుకోవటంకోసం నాటకమంతా క్షుణ్ణంగా చదవవలె. ఆ పాత్ర ధరించేనటుని-నాటకమంతా చదివిన తరవాత-కింది ప్రశ్నలు వేసుకొమ్మని చెప్పవలె.
1. నాటకంలోని ఏ భాగము తనను ముఖ్యంగా అకర్షించినది
2. ఏ పాత్రమీద తనకు సానుభూతి కలిగించి
3. నాటకంలోని ముఖ్య పాత్ర లేమిటి.
4. నాటకంలోని ఏ పాత్రలు తనను ఎక్కువగా చలింప జేసినవి
5. తాను నటించవలసిన పాత్రకు, నాటకంలోని తక్కిన పాత్రలకు గల సంబంధ బాందవ్యాలేమిటి తన పాత్రకు సన్నిహితంగా ఉండేవేని
6. నాటకము అందించే సందేశ మేమిటి
7. నాటక కధాసంవిధాన మేమిటి
ఈ విధంగా, తాను, నాటకాని పరిశీలించిన తరవాత నటునిచేత కూడ పరిశీలింప జేయవలె. ఊహాశక్తితో నటుడు తన పాత్రచిత్రణము రూపొందించు కోవటానికీ స్వభావ స్వరూపాలు ఎనిక చేసుక్జోవటానికీ ఈవిధమైన పరిశీలన ఎంతో సాయపడుతుంది. నాటకంలోని ప్రతి ప్రత్యేక పాత్ర బాధ్యత ఏమిటో, సమిష్టిగా ఇతర పాత్రలతొ ఈ బాధ్యత ఎట్లు నిర్వహింప వలెనో బోధపడవలె.
రెండవ దశ
దర్శకుడు మొదటి దశలోని అంశాలన్నీ నటీనటులు మనస్సులకు పట్టించుకునేటందుకు తగిన వ్యవధి ఇయ్యవలె. తర్వాత మొదటి దశలో సూచించిన అభిప్రాయాలు సరిఅయినవా, కాదా అనే సూక్ష్మ పరిశీలన చేయవలె. రచయిత ఇచ్చిన సూచనలను బట్టిగాని, సంభాషణలను బట్టిగాని పాత్రల విషయమై కింది ప్రశ్నలు అధారంగా పాత్రల స్వభావస్వరూపాలు నిర్ణయించవలె.