పుట:RangastalaSastramu.djvu/247

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూడవది మానసికము-ఇది మొదటి రెందు పరిణామాల ఫలితంగా రూపొందుతుంది, వాటి ప్రభావంవల్ల, ఆశనిరాశలకూ మనస్తత్వానికీ, వైఖరికీ, స్వాతిశయ న్యూనతా భావాలకూ జీవము వస్తుంది.

మానవుని ప్రక్రియలకు (actions) అర్ధము చేసుకోవలెనంటేఆ ప్రక్తియల వెనుకౌన్న ఉద్దేశము తెలుసుకోవలె.

మానవుడు జబ్బుగా ఉన్నప్పుడు ఓకవిధంగాను, ఆరోగ్యంగా ఉన్నప్పుడు మరోవిధంగాను ప్రవర్తిస్తాడు.

ఒక్కొక్క అవయవాలు వికారంగా ఉండవచ్చు, మరొకనికి అవి లోపించవచ్చు, ఒకదు ఈ వికారాలను. లోపాలను తేలికగా తీసుకొంటాదు; మరొకడు తీవ్రంగా మనస్సుకు పట్టించుకొని బాధపడతాడు. ఇంకొకడు, అసంతృప్తి, చిరాకు మాత్రము పడవచ్చు, ఇది దృక్పధాన్ని రూపొందిసుంది. అట్లాగే సంఘంలో మానవుని స్థానము, ఇతరులు అతనిని చూచేవిధముకూడా అతని దృక్పధాన్ని, మనస్తత్వాన్ని నిర్ణయిస్తాయి. శారీరక సాంఘిక పరిమాణాలు రెండూ కలిసి మానసికపరిమాణాన్ని జనింపజేస్తాయి. ఈ మూడు పరిమాణాలు మానవ చేష్టల కారణాన్ని తెలుపుతాయని గ్రహిస్తే ఏ పాత్రనుగూర్చి అయినా తెలుసుకొని, ఆ పాత్ర చేష్టలకు కారణము గ్రహించడం తేలిక. ఈ మూడు పరిమాణాల అధారంగా పాత్రను విశ్లేషించేటట్లయితే ఈ కింగివిధంగా ఉంటుంది.

1. శారీరకము

1. స్త్రీ లెదా పురుషుడు.
2, వయస్సు,
3. ఎగ్గు, బరువు,
4. జుట్టు, వేళ్ళు, చర్మము, రంగు
5. భంగిమ.
6. ఆకార విశేషాలు, అందచందాలు, శుభ్రతి,
7. లోపాలు (అవయవలోపాలు, అతిగా పెరుగుదల, అతితక్కువ పెరుగుదల, పుట్టుమచ్చలు, వ్యాధులు మొదలైనవి.)
8. అనువంశిక (Hereditary) విశేషాలు.