చెబుతూఉన్న నటుని ముఖంవంకగాని, మరొక ముఖ్యకేంద్రంవంకగాని చూడటం ద్వారా సాధించవచ్చు. పాత్రసమ్మేళన పెద్ద పరిథిలో జరిగినప్పుడు ఈ పద్ధతి విసుగు కలిగిస్తుఒది. అందుచేత, కనీసము ఒకటి రెండుపాత్రలు ముఖ్యకేంద్రంవంకగాక, ఆ కేంద్రంవంక చూసే ఇతర నటులవంక చూడటం కొంత వైవిధ్యాన్ని సాధించగలదు.
సమ్మేళనంలో ప్రాధాన్యము (Emphasis in Grouping)
ప్రదర్శనరససిద్ధిదృష్ట్యా ఏపాత్రకు ఏసందర్భంలో ఎట్టి ప్రాముఖ్యము ఇయ్యవలెనో దర్శకుడు చక్కగా ఆలోచించిల్ పాత్ర సమ్మేళనము ఏర్పాటు చేసుకోవలె. విభిన్న పరిస్థితులలో, సమ్మేళన ప్రాధాన్యము విభిన్నంగా ఉంటుంది. కాబట్టి సమ్మేళనంలో ఎప్పటికప్పుడు దర్శకుడు తగిన సర్ధుబాట్లు చేసుకోవలె.
ప్రదేశాన్నిబట్టి ప్రాధాన్యంకూడా మారుతూ ఉంటుంది. ఎగువఎడమ (LL)లో ఉన్న పాత్రకు ప్రాముంయము తక్కువ. ఎగువకుడి (UR) మెరుగు; అంతకన్న దిగుఎడమ (DL) మెరుగు. ఎగు;వమధ్య (UC), దిగుఎడమ (DL) ప్రదేశా;ఇ రెండూ దగ్గరదగ్గర, సమాన లక్షణాలుగలవి. దిగువమధ్య (DC) ఎక్కడా ప్రాధాన్యము కలిగింది. ప్రేక్షకులకు సామీప్య మెక్కువైనకొద్దీ (సమ్మేళన) శక్తి, ప్రాధాన్యముహెచ్చుతుంది. ఇది--1. ప్రేక్షకులకు దగ్గరగా