Jump to content

పుట:RangastalaSastramu.djvu/230

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మైనది. సన్నివేశం చివరిభాగంలో దిగువమధ్య (D C) కు మార్చవలసివచ్చినా, ముఖ్యసన్నివేశాలు ప్రారంభించదగిన ప్రదేశము

6 DC (దిగువ మధ్య)

ఇది శక్తిమంతమైనది. కఠినత్వముసూచించేది. అలంకరణశూన్యము. తీవ్రతకలిగినప్రదేశము. నాటకంలోనిసమస్యలు, శక్తిమంతములై ముఖాముకి తేల్చవలసిన సమస్యలు ఉండే సన్నివేశాలలో ఉపయోగించదగినది. కాబట్టి అట్టి దృశ్యాలకోసము ప్రత్యేకించవలె.

రంగస్థలంలోని విదిధప్రదేశాల ప్రాముఖ్యము తక్కిన ఏర్పాట్లవల్ల మారే అవకాశంకూడాఉన్నది.

ఉదాహరణకు: ఎవుగ ఎడమ (UL) లోగాని, ఎగువకుడి (UR)లోగాని వేదికలు (platforms) ఉపయోగించడంద్వారా వాటి ప్రాముఖ్యము, శక్తి ఎక్కువచేయవచ్చు. రంగస్థలంమీద ఉన్న ప్రదేశాలలో ఎక్కువ పాత్రలతో నిండియున్నప్పుడు ముఖ్యపాత్రలుగల ప్రవేశం లక్షణాలు మాత్రమే గమనించవలసి ఉంటుంది. ముఖ్యపాత్రలు వేర్వేరు ప్రదేశాలలో సర్దుకుపోయినప్పుడు ఈ సమస్యలు ఎక్కువగా ఉండవు. పాత్రసమ్మేళనంలో చేసిన ఈ సూచనలు మామూలు అలవాట్లనుబట్టి అనగా మానవ సహజమైన వైఖరిని బట్టి రూపొందించడం జరిగింది. సాధారణ పరిస్థితులలో, మనకు ఎడమనుంచు కుడికిచూడటం మనము పుస్తకాలు చదవటం మొదలైన అలవాట్లవల్ల- ఏర్పడుతుంది. ఎడమవాటము ఉన్నవారికి ఈ సూచనలు అంతగా ఆదరణయోగ్యంకావు. అట్లాగే, నాటకంయొక్క ప్రత్యేకలక్షణాలను వాటి అవసరాలనుబట్టి తగినవిధంగా మార్పు చేసుకోవలె.

బాంధవ్యాలు (Relationship)

పాత్రసమ్మేళనము పాత్రలమధ్య పరస్పర సంబంధాలనూ, రంగస్థలంమీద భావసూచనావకాశాలుగల వస్తువులకు పాత్రలకు మధ్యగల సంబంధాలనూ ప్రకటించేటట్లు రూపొందించవలె.

ఇంతేగాక, ఈ సూచనలన్నీ ప్రేక్షకదృష్టి సమీకరించవలసిన కుతూహల కేంద్రస్థానానికి చేరుకొనేటట్లు దర్శకుడు జాగ్రత్త పడవలె. చిన్నదృశ్య సమీకరణలో ఈ ఫలితము సంభాషణలులేని పాత్రలు, సంభాషణలు