Jump to content

పుట:RangastalaSastramu.djvu/199

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రూపభేదాలు

రంగస్థలమనేకవిధాలుగా పరిణామముచెందింది. ప్రస్తుతముఎక్కువగా వాడుకలోఉన్నది (Protcenium Stage) రంగద్వారంగల రంగస్థలము. ఈ రకపు రంగస్థలంమీదిప్రయోగాన్ని దృష్టిలోఉంచుకొనే దర్శకత్వంలోని ప్రయోగపద్ధతులు మొదలైనవన్నీ వివరింపబడుతున్నాయి. అయితే, ఉన్న స్థలాన్నిబట్టి, అవసరాలనుబట్టి, ఇతరవిధాలైన రంగస్థలాలలోకూడా నాటక ప్రదర్శన ఏర్పాటుచేసుకోవచ్చు. రంగస్థల రూపంలోనితేడాలను బట్టి అభినయావరణ - ఆకరము, వైశాల్యము, పరిధి తేడాలతో రూపొందుతాయి. ఈ వైవిధ్యాన్నిబట్టి ప్రయోగపద్ధతులు, రంగస్థల పరికరాలు, రంగసజ్జీకరణ (Set Construction), దీపనము (Lighting), వస్తూపయోగము, నటీనటుల కదలికలు, సంరచన మొదలైనవన్నీ మార్పుచెందుతాయి.

ఇప్పుడు పలురకాలైన రంగస్థలాలను గురించిన స్థూలవివరణ.

1. రంగద్వారరంగస్థలము (Proscenium Stage)

మూడువైపుల మూసివేయండి, నాలుగవవైపునఉన్న చత్రంద్వారా ప్రేక్షకులు నాటకదృశ్యాన్ని చూడటానికి అనుకూలంగా ఉండేరంగస్థలము. ప్రేముకట్టినబొమ్మను ఎట్లాగాచూసే అవకాశంకలదికనుక దీనిని (Picture frame stage) అనికూడా అంటారు.

2.వేదికారంగస్థలము (Platform Stage)

వేదికపై అమర్చిన రంగస్థలము. మూడువిఅపు;ల ప్రేక్షకులు కూర్చుండి రంగదృశ్యాన్ని చూసే అనుకూల్యంగల రంగస్థలము.

3. చొచ్చుకొనివచ్చే రంగస్థలము (Thrust Stage)

వేదికారంగస్థలంవలెనే రంగస్థలం మూడువైపులనుంచి రంగస్థల దృశ్యము ప్రేక్షకులకు కనిపిస్తుంది.