పుట:RangastalaSastramu.djvu/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తకే ఎక్కువ ప్రాముఖ్యమిస్తున్నారు. ఇంక రెండవది: నాటకాలకంటె నాటికలు ఎక్కువగా వ్రాస్తున్నారు. దీనికి కారణము నాటక సమాజాల ఆర్ధికస్థితి అని పేర్కొనవచ్చు. ముఖ్యంగా ఔత్సాహిక నాటక సమాజాలు చాల వరకు సభ్యుల ఉత్సాహమే పెట్టుబడిగా స్థాపించబడతాయి. అందుచేత సమాజంవారు నాటికలనే ఎక్కువగా ప్రదర్శిస్తున్నారు.

నాటకరచనలో కనిపించే మరో విశేషము - పౌరాణిక, చారిత్రక నాటకాలకన్ని సాంఘిక నటకాలు ఎక్కువగా వెలువడటం. అప్పుడప్పుడు చారిత్రక నాటకాలు వెలువడుతున్నా, పౌరాణిక నాటకాల సంఖ్య రానురాను తగ్గిపోతున్నది.

ఈ రచనారీతులను కిందివిధంగా విశ్లేషించి చూడవచ్చు-

1.పౌరాణిక నాటకాలు: ఈ నాటకాలు ఇప్పుడు దాదాఉ ఎవరూ రచించడంలేదు. కాని ఈ నాటకాలలో ముఖ్యలక్షణము వాని ఆదునికత, పౌరాణిక గాధలను ఆధునిక భావాలకు అనుగుణంగా వ్యాఖ్యానించడం ఈ నాటకాల ప్రత్యేకత.

ఉదా|| దివోదాసు, రాగవాసిష్ఠం.

2. చారిత్రక నాటకాలు: వెనుకటి కాలంలో చారిత్రక నాతకాలు జానిని ఉత్తేజపరచడానికి వ్రాసినవి. కాని ఈ కాలంలో వ్రాస్తున్న వన్నీ వ్య్హక్తి చరిత్రలు ప్రధానంగా కల నాటకాలు (character plays).

ఉదా|| నరసన్నభట్తు, అశోక సమ్రాట్, విశ్వంతర.

ఈచారిత్రక నాటకాలలో 'విశ్వంభర ' బౌద్ధ చరిత్ర ఆధారంగా వ్రాసినది. ఎంతో పరిశోధన ఫలితంగా వెలువడిన రచన ఇది. 'అశోక సామ్రాట్ ' లో నాటకీయ సంఘర్షణ, వ్యక్తి శీల నిరూపణ ముఖ్యంగా సాగింది. ఇటీవల చారిత్రక రూపకాలను వ్రాస్తున్నవారిలో శ్రీ ఎన్ వి. ఆర్. కృష్ణమచార్యులు గారు ప్రముఖులు.

3.సాంఘిక రూపకాలు: సాంఘిక రూపకాలలో తిరిగి అనేక ఉపవిభాగాలున్నాయి. అందులో కొన్నింటిని మాత్రమే కింద పేర్కొనడం జరుతున్నది--

1. సంఘానికి వ్యక్తికి మధ్య సంఘర్షణ