Jump to content

పుట:RangastalaSastramu.djvu/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వర్తమాన నాటకరీగులు

లిటిల్ ధియేటర్ ఉద్యమంద్వారా వీరు తెలుగు నాటకరంగానికి ఎంతో సేవ చేసినారు. సుబ్బారావుగారు రచించిన 4 నాటకాలు 3 ఏకాంకికలు ముద్రితమయినవి.

ఆత్రేయ

పీడిత ప్రజాకోటికి సాహిత్య ప్రతినిధి ఆచార్య ఆత్రేయ. ఏ మూల ఏ అన్యాయము జరిగినా వెనువెంటనే ప్రతిచలనము ఆత్రేయ్ హృదయంలో పొంది, కలంలోనుంచి దూసుకొని వస్తుంది. అందుచేతనే ఆయన నాటకసాహిత్యంలో సమకాలీన జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సాంఘిక సమస్యలు, సంఘటనలు తీవ్రరూపంలో ప్రతిబింబిస్తూ ఉంటాయి. 'ఈనాడూ నాటకము భారతదేశంలో 1947, 48 సంవత్సరాలలో జరిగిన మతకలహాలకు, 'వాస్తవం ' 1950 నాటి ఆంధ్రదేశ రాజకీయాలకు, 'ప్రగతి ' మరణాయుధ నిర్మాణానికి, 'విశ్వశాంతి ' శాంతి ఉద్యమానికి ప్రతీకలు.

ఆత్రేయ వాస్తవికతా వాది. తనచుట్టూ ఉన్న జీవితాన్ని నిశితంగా పరిశీలించి స్పష్టంగా విశ్లేషించి తన నాటకసాహిత్యంలో ప్రతిబింబింప చేసినాడు. ఆత్రేయ.

ఆయన వాస్తవిక రూపకాలలో ఉత్తమమైనది 'ఎన్.జి.వొ,' మధ్యతరగతి జీవితాన్ని, వాళ్ళ మిధ్యా ప్రమాణాలను, పీడిత జాతుల అష్టకష్టాలను ఇందులో ప్రతిభావంతంగా చిత్రించినారు రచయిత. ఆయన వ్రాసిన ఎన్నో నాటకాలలో ఇట్టి వాస్తవిక జీవిత చిత్రణే మనకు కన్పిస్తుంది.

ఆగత్రేయ వ్రాసిన ప్రతీక రూపకాలలో 'భయం,' 'విశ్వశాంతి ' పేర్కొనదగ్గవి. రచనలోను, పాత్ర పోషణలోను పరిపుష్టమైన నాటకము 'అశోక్ సాంమ్రాట్.'

వర్తమాన నాటకరీతులు.

గత రెండుమూడు దశాబ్దాలుగా వస్తున్న తెలుగు నాటకసాహిత్యంలో విభిన్నరీతులు కానవస్తున్నవి. వీటిని జాగ్రత్తగా పరిశీలిస్తే రెందు విషయాలు స్పష్టంగా తెలుస్తవి - మొదటిది: నాటకకర్తలు రంగస్థల ప్రదర్శనానికి అనుకూలంగా ఉండే నాటకాలను ఎక్కువగా వ్రాస్తున్నారు. వెనక వంద సంవత్సరాలలో వలె సాహిత్య గౌరవానికి అంతగా ప్రాముఖ్య మివ్వక, ప్రదర్శనానుకూల