పుట:RangastalaSastramu.djvu/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పానుగంటి లక్ష్మీనరసింహారావు

"ఆంధ్రా షేక్స్ పియర్,' 'అభినవ కాళిదాసు ' అని పేరుగాంరిన 'బహు సరస నాతకరచనా పటిష్టులు ' పాను;గంటి లక్ష్మీనరసింహారావుగారు (1865-1940). పానుగంటివారు సంస్కృతాంధ్రాంగ్ల పండితులు. గ్రాంధిక వాది, నాటకాలలో తేటగీతి, ఆటవలది వంటి దేశిచందస్సులేగాని లయప్రధానమైన గణ చంధస్సులు వాడరాదని వారి సిద్ధాంతం.

వీరు రామభక్తులు కావడంవల్ల రామాయణాన్నంతటినీ - ఉత్తర రామాయణము మినహా - నాలుగు నాటకాలుగా రచించినారు. గ్రాంధికవాదులైనా సంభాషణలు తీవ్ర గ్రాంధికంలోగాక అందరకు అర్ధమయ్యే సులభ గ్రాంధికంలో వ్రాసినారు. వీధి నాటకాలల్జో ఎక్కువభాగము గద్య పద్యాత్మకాలు. వీరు అంకాలను రంగాలుగా విభజించలేదు. సంస్కృతనాటక లక్షణాలనె ఎక్కువగా పాటించినారు. పాత్రోచిత భాషావాదము వీరికి నచ్చినట్లులేదు. ఎక్కడా పాత్రోచిత్గ జ్భాష నుపయోగించలేదు.

'సారంగధర ' నాటకము మోదాంతంగా రచించిన వీరు చివరిదశలో తమ అభిప్రాయ్హము మార్చుకొని 'పూర్ణిమ,' 'రాతిస్తంభము ' అనే నాటకాలను విషాదాంతంగా వ్రాసినారు. అట్లాగే తమ నాటకాలలో బహుళంగా పద్యాలు వ్రాసిన వీరు 'పద్మినీ,' విచిత్ర వివాహము,' 'రాతిస్తంభము ' అనే నాటకాలను పూర్తిగా వచనంలోనే వ్రాసినారు.

సంభాషణారచన, సన్నివేశకల్పన, పాత్రోన్మీలనము పానుగంటివారి సొత్తు. సంభాషణలు ఉక్తివిచిత్రితో శోభిస్తూ జనరంజకంగా ఉంటాయి. అయితే మధ్యమధ్య ఉపన్యాసధోరణి, దీర్ఘ స్వగతాలు, పద్యమాలికలు, పునరుక్తులు నాటక గమనానికి కొంత ఆటంకము కలిగిస్తాయి.

పానుగంటివారు హాస్యరచనలొ సిద్ధహస్తులు. రకరకాల హాస్యము వీరి నాటకాలలో లభ్యమవుతుంది. అయితే వీరి హాస్యము ఉరకలు పెడుతూ ఒక్కొక్కప్పుడు గంభీర రంగాలను చెదరగొట్టడంకూడా కద్దు. నిత్యజీవితంనుంచి ఉపమానాలు అన్నుక్జోవడంలో వీరు ప్రజ్ఞావంతులు.

వీరి పౌరాణిక నాటకాలు 7, చారిత్రక నాటకాలు 7, కాల్పనికాలు 11, సాంఘికాలు 5, వెరశి -30; ప్రహసనాలు 12.