Jump to content

పుట:RangastalaSastramu.djvu/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాటకము 1892లో అప్పారావుగారు రచించినారు; ఆ సంవత్సరమే అది ప్రదర్శితమై ఎంతో మెప్పును పొందింది.

అప్పారావుగారి అపూర్వసృష్టి "కన్యాశుల్కము", సంభాషణలు నడవడంలో, సన్నివేశ్కల్పనలో, మనస్తత్వ చిత్రణలో, వ్యచహారికభాషా ప్రయోగంలో అప్పారావుగారి ప్రతిభ ఈ నాటకంలో గోచరిస్తుంది. నాటి సమాజంలోని వివిధ తరగతులవారు ఈ నాటకంలో మనకు తారసిల్లుతారు. ఆనాటి సాంఘిక జీవితము, సమాజంలోని వైరుధ్యాలు ఇందులో కళ్లకుకడతాయి.

"కన్యాశుల్కం" ఆసాంతము హాస్యరసంతో తొణికిసలాడుతూ 'ఇది ఒక పెద్ద ప్రహసనమా ' అనిపిస్తుందు. కాని ఇంత హాస్యంవనక గొప్ప గంభీరత దాగిఉన్నది. ఈ నాటకంలోని ప్రతిపాత్ర అగ్నిపరీక్షను ఎదుర్కొంటుంది చూస్తే దానికనుగుణంగా రంగురంగుల గాజుముక్కలు కనిపింపజేసే చిత్రప్రదశ్నిని వంటిది "కన్యాశుల్కం"

ఈ నాటకంలోని పాత్రలు జీవకళతో ఉట్టిపడుతూ తెలుగువారి హృదయాలలో హత్తుకుపోరాయి. ఆంధ్రనాతక సాహిత్యాన్ని తీర్చిదిద్ది, తెలుగు జాతికి అప్పారావుగారు అర్పించిన పాత్రలు గిరీశం, మధురవాణి.

ప్రతాపరుద్తీయ్ంవలెనే కన్యాశుల్కంకూడ రెందుమూడు రాత్రులు ప్రదర్శించ తగినంత పెద్దనాటకము. అందుచేతనే దానిలో సౌష్టవము తక్కువ. మాండలిక పదాలు, ఇంగ్లీషుపదాలు ఎక్కువగా వాడడంవల్ల అన్ని తరగతుల వారికి ఇద్ సుబోధరము కాదనే అబిప్రాయ మెక్మువగా పండితులలో వ్యాపించిఉంది. ఏమైనా శ్రీ శ్రీ చెప్పినట్లు "కన్యాశుల్కం" గొప్పది. జీవితమంత గొప్పది".

సాంఘిక నటకాలనేగాక చారిత్రక నాటకాలనుకూడ వ్యావహారిక భషలో రసవంతంగా రచించవచ్చునని "బిల్హణీయ" నాటకంలో రుజువుచేశారు అప్పారావుగారు. అయితే దురదృష్టవశత్తు ఇది పూర్తికాలేదు. పూర్తికాని ఇంకో నాటకము 'కొండు భట్టీయం.' ఇద్ ఆనాటి సాంఘిక జీవితానికి ప్రతిబింబమే కాని కన్యాశుల్కంలోని శిల్పనైపుణ్యం ఇందులో గొచరించదు; కాని కన్యాశుల్కంలోని పాత్రల నమూనాలు ఇందులో గోచరిస్తాయి.