పుట:RangastalaSastramu.djvu/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వానిలో ముఖ్యమైన ఆత్రేయ 'విశ్వసాంతి,' అనిశెట్టి 'శాంతి.' గిడుతూరి సూర్యం 'మానవుడు.' వీటిలో యుద్ధానికి, శాంతికి సంఘర్షణ చిత్రితమయింది.

నాటినుంచి నేటివరకు రైతు కూలీ సమస్యలు, భూమి పోరాటాలు, సాంఘిక అన్యాయాలు, భూస్వమ్య వ్యవస్థ, పెట్టుబడిదారీ వ్యవస్థ, ఉన్నవారికి లేనివారికి సంఘర్షణ, గ్రామీణ సమస్యలు, పంచ్వర్ష ప్రణాలికలు, అపరాధ పరిశోధన, స్వాప్నికజగత్తు, జానపద గాధలు, రాజకీయాలు, వర్గపోరాటము తెలుగు రచయితలకు కధావస్తువులైనాయి. గత 20 సంవత్సరాలలో వెలువడిన తెలుగు నాటకాల ఇతివృత్తాలలో ఉన్నందున వైవిధ్యము అంతకుమున్నెన్నడూ కనిపించదు.

నాటక సాహిత్యంతోపాటే ఆదినుంచి నాటికా సాహిత్యము కూడ పెంపొందుతూనే వచ్చింది. వీటి ఇతివృత్తాలలోకూడ ఎంతోవిఅవిధ్యము గోచరిస్తుంది. మల్లాది విశ్వనాధశర్మ, భమిడిపాతి కామేశ్వరరావు హాస్యనాటికలకు మార్గదర్శకులైనారు. గంభీరమైన నాటికలకు పి.వి.రాజమన్నారు ఆదర్శమైనాడు. కొప్పరపు సుబ్బారావుగారి 'అల్లీముఠా ' గేయనాటికలకు, అనిశెట్టివారి 'శాంతి ' మూకనాటికలకు మార్గదర్శకాలైనాయి. పద్యనాటికలు. గేయనాటికలు, రేడియోనాటికలు విరివిగా వెలువడుతున్నాయి.

ఇది ఈ శతసంవత్సర తెలుగు నాటకప్రగతి.

ఆధునిక నాటక సాహిత్యాన్ని సూక్షంగా పరిశీలిస్తే ఈ కింది లక్షణాలు ప్రముఖంగా గోచరిస్తాయి--

1.రైతు, కూలి, గుమాస్తావంటి సామాన్య మానవుని జీవితచిత్రణ. ఉదా|| రైతుబిడ్డ, కూలీ, పాలేరు.

2.గ్రీకు ఐక్యత్రయం వైపుమొగ్గు-- ఒకేరంగసజ్జ (Set), ఒకే అంకము. కాలము 12-24 గం|| ఉదా|| "భయం"

3.స్త్రీ పాత్రలేని నాటకరచన. ఉదా|| "దొంగవీరడు"

4.;పరాకష్ఠలో నాటకము ప్రారంభించడం. ఉదా|| పంకజం, పునర్జన్మ.

5.నేపధ్యగానం ద్వారా పాత్రల మానసికావస్థల చిత్రణ.

ఉదా|| దీక్షితదుహిత, గాలిమేడలు, నేతబిడ్డ.

6.నాటకమంతా ఒకపాత్ర ఇంకోపాత్రతొ చెబుతున్నట్టు చిత్రణ. ఉదా|| "పితూరి".