వీధినాటకము
లకు గౌరవ ప్రపత్తులు, బహుళ వ్యాప్తి కలిగించిన వారు శ్రీమధజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసుగారు.
వీధినాటకము
ఒకేఒక పాత్ర్ర ఆడుతూ పాడుతూ కధవినిపించే దశల్నుంచి ఒక్కొక్క పాత్రను ఒక్కొక్క వ్యక్తి ధరించే దశకు పరిణతిచెండిన యక్షగానాలనే--యక్షగాన నాటకాలని, వీధినాటకాలనీ, బయలటలనీ అంటున్నారు. వీధిలో ప్రదర్శిస్తారు కాబట్టి వీధినాటకాలనీ, బయలాతలనీ పేరువచ్చింది. ఇది సంగీత నృత్య రూపకము.
కలాపాలలోవలె వీటిలో రగడలు, త్రిపుటలు మొదలైన చందస్సులకు బదులు పదాలు, దరువులు, జతులు, ద్విపదలు, కైవారాలు ఎక్కువ. పాత్ర తన పేరూ వృత్తాంతమూ చెప్పుకొంటా తెరవెడలి, రంగంమీదకు ప్రవేశిస్తుంది. వీధినాటకాలలో పాత్రలు సంఖ్య పెరిగింది. నాటకీయత అలవడింది. సంభాషణాత్మకాలుగా యక్షగానాలు రూపొందినవి. సూత్రధారుని ప్రాధాన్యము హెచ్చించి.
వీధినాటకాలు తంజావూరు రాజుల కాలంలో పరిణతదశకు వచ్చినవి. ఆ కాలంలో సమకాలీన మహాపురుషుల జీవిత ఖండాలను నాటకాలుగా వ్రాయడం ప్రారంభమైంది. విజయరాఘవ నాయకుని 'రఘునాధాభ్యుదయము ' రంగాజమ్మ 'మన్నారు దాన విలాసము ' ఇందుకు మంచి ఉదాహరణలు. తంజావూరు నాటకాలలో--కొన్నింటిలో శృంగారము, హాస్యము కొంచెము మోటుగా, ఆశ్లీలంగా ఉన్నా కవిత్వము బహుసొంపుగా ఉఓటుంది.
ఉదా|| వల్లీకళ్యాణము, పార్వతీ కల్యాణము
వీధినాటకాల రంగస్థలంకూడ ఆరుబయలురంగస్థలమే. ఆరుబయలు పందిరిలో బల్లలతోనో మట్టితోనో నిర్మించిన వేదికే రంగస్థలము. బాడితచెక్క కిరీటాలు, భుజకీర్తులు ధరించేవారు. పూర్వకాలపు దుస్తులు, ఆభరణాలు ధరించేవారు. స్త్రీ పాత్ర దారులు జుట్టు పెంచేవారు. అద్ధళంతో ముఖానికి కోటా వేసుకొనేవారు. కాగడాలే దీపాలు. అప్పటికప్పుడు పట్టే దుకూలమే తెర, సూత్రధారుడు దైవప్రార్ధనచేసి కధా క్రమము చెప్పిన తర్వాత సూత్రధారుడు లేదా ద్వారపాలకుడు అనే పాత్ర ప్రవేశించి అసలు నాటిక కధలోని పాత్ర (సామా