పుట:RangastalaSastramu.djvu/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హరికధ

యక్షగాన ప్రబంధంలోవలె ఒకేవ్యక్తి ఆడుతూ పాడుతూ కధవినిపించే కళారూపమే హరికధ. ఈ హరికధను చెప్పే కళాకారులను 'హరిదాసు ' లంటారు. ఆదిలో విష్జ్ణుకధలనె చెప్పేవారు కాబట్తి ఈ కళారూపానికి హరికధ అనేపేరు వచ్చిఉంటుంది.

సాధారణంగా హరిదారు పట్టుబట్ట కట్టి, పట్టు ఉత్తరీయము నడుముకు బిగించుకొని, మెడలో పూలదండ వేసుకొని, కాళ్ళకు గజ్జెలు కట్టుకొని చేతితో తాళంగాని, చిరతలుగాని, వాయిస్తూ నృత్యముచెస్తూ కధ చెబుతాడు. కొందరు హరికధకులు వంచపాటకూడ పెట్టుకొంటారు. ఫిడేలు, హార్మనీ, మద్దెల లేదా తబల వీరి సహకారవాద్యాలు. కధచెబుతూ మధ్య మధ్య హాస్య ధోరిణిలో నీతిబోధకమైన పిట్టకధలు చెప్పి కధకుడు ప్రజలను రంజింప జేస్తూ ఉంటాడు. ప్రజలను సన్మార్గ ప్రవర్తకులుగాను, దైవభక్తులుగాను చేయడానికి హరికధలు మంచిసాధనంగా రూపొందినవి. భగవంతుని లీలలను భక్తిప్రభావాలను బోధించడమేగాక సమకాలీన సంఘజెవనంలోని దురాచారాలను, దుష్కృత్యాలను, అన్యాయ ప్రవర్తనలను హరిదాసు దుయ్యపట్టుతూఉంటాడు.

హరికధా;ప్రదర్శన కూడ ఆరుబయలు ప్రదర్శనమే! అందుచేత హరిదాసు నాలుగువైపులా తిరుగుతూ కధ చెబుతాడు. పాత్రలన్నింటిని ఒక్కడే ఒప్పించవలసి ఉన్నందున హరిదాసు సర్వతోముఖ నటుడై ఉండవలె; సాహిత్యంలో, స్సంగీతంలో ప్రజ్ఞావంతుడై ఉండవలె; మాటకారి, హాస్యకారి అయిఉండవలె.

హరికధ రచనా క్రమము యక్షగాన ప్రబంధ రచనాక్రమమువంటిదే! కాని జంపె, త్రిపుట మొదలైనవాటి బదులు హరికధలో దరువులు, కీర్తనలు, దంఛకాలు, చూర్ణికలు, తొహరాలు, మట్లు ప్రవేశించినవి.

ఆదిలో విష్ణుకధలె హరికధలుగా చెప్పబడినప్పటికీ రానురాను జారకీయ, చారిత్రక విషయాలుకూడ హరికధలకు ఇతివృత్తాలవుతున్నవి. దీనితో హరి కధ అనే పదంలో వ్యుత్పత్త్యర్ధము నిరర్ధకమై ఒకానొక్ ప్రత్యేక కళా రూపానికి పేరుగా పరిణమించింది.

మునిపల్లె సుబ్రహ్మణ్యకవి అధ్యాత్మ రామాయణ కీర్తనలు, తాళూరి నారాయణకవి మోక్షగుండ రామాయణము హరికధలకు తొలిరేఖలు. హరికధ