పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/69

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రాజ__గట్టివాఁడయినయెడల నీవాతని నొక్క పర్యాయము మధ్యాహ్నము మా యింటికి వెంటబెట్టుకొని వచ్చి సుబ్బమ్మను చూపెదవా?నాలుగు దినములనుండి దాని శరీరములో రుగ్మతగా నున్నందున వంటకు మిక్కిలి యిబ్బంది వడుచున్నాము.

రాఘ__ఆవశ్యముగా దీసికొనివచ్చెదను. అతనికా భేషజములు లేవు. ఎవరు పిలిచినను వచ్చును.

సిద్ధాంతి__ఆతనికడ స్వర్ణముఖీవిద్య కలదని చెప్పుచున్నారు. మహానుభావులు గోసాయీలలో నెటువంటివారైనను నుందురు.

రాఘ__ఆతఁడు ప్రతిదినమును దమ్మిడియెత్తు రాగి కరఁగి బంగారముచేయునఁట: ఆతడప్పుడప్పుడు బ్రాహ్మణులకు దానధర్మము చేయుచున్నాడు. ఈ విద్యయే లేకపోయిన నాతనికి ధన మెక్కడ నుండి వచ్చును?

రాజ__రాఘవాచారీ! దేవున కధ్యయనోత్సవములు క్రమముగా జరుగుచున్నవా?

రాఘ__తమ యనుగ్రహ ముండఁగా ఉత్సవములకేమి లోపము? నిరుడు పుష్యమాసములో సంక్రాంతినాఁటి యుత్సవము ప్రత్యేకముగా తమ ద్రవ్యముతో జరిగినది. నిన్ననో మొన్ననో లాగున కనఁబడుచున్నది; ఆప్పుడే సంవత్సర మయినది. రేపే సంక్రాంతి__ఈ సంగతి తమతో మనవిచేయుటకే వచ్చి సుబ్బమ్మ గారికి జబ్బుగా నున్నందున సమయముకాదని యూరకున్నాను.

రాజ__క్రిందటి సంవత్సరము నూటయేఁబది రూపాయల నిచ్చినాను. ఈసంవత్సరము మాలోవల వివాహములు తటస్థమయినవి గనుక నూఱు రూపాయలను మాత్రమే యిచ్చెదను. ఏలాగున నయిన దానితో సరిపెట్టవలెను.

రాఘ__చిత్తము. దానికేమి? ఆలాగుననే చేసెదను.

రాజ __రాఘవాచార్యులూ బైరాగి నవశ్యముగా నేఁడే యింటికి తీసికొనివచ్చి నీవు మఱియొక పనిని చేసికోవలెను జుమీ! ప్రొద్దెక్కుచున్నది. శీఘ్రముగా వెళ్లు సిద్ధాంతిగారూ! మీకు సందేహముగా నున్న పక్షమున శంకరయ్య జాతకము మఱియొకసారి