పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మ్మకు నగలే లేవే" అని పరులమీఁది దోషముల నెన్నుకొనుచు మెట్లెక్కి యిండ్లకు నడచిరి. విద్యాగంధమే యెఱుఁగని మూఢ వనితలకు మాటాడుకొనుట కంతకన్న మంచి విషయము లేమి దొర కును? అక్కడకు వచ్చెడి స్త్రీలు సాధారణముగా సంభాషించెడి యితర విషయములు సవతుల పోట్లాటలను, మాఱుతల్లుల దుర్మా ర్గములను, మగల యనాదరణమును మొదలైనవి తప్ప మఱి యేమియు నుండవు.

అప్పడు కుడిచేతిలో తాటాకులమీఁద వ్రాసిన పంచాంగమును బట్టుకొని, నీర్కావి ధోవతి కట్టుకొని, మడతపెట్టిన చిన్నయంగ వస్త్ర మొకటి బుజముమీఁద వేపికొని, మొగమునను దేహమునను విభూతి పెండెకట్లు స్పష్టముగా గానుపింప, నిమ్మకాయ లంతలేపి రుద్రాక్షలు గల కంఠమాల ప్రకాశింప, రొండినిబెట్టుకొన్న పొడుము కాయ చిన్నకంతివలెఁ గనఁబడ, గట్టుమీఁదినుండి పోవుచు గోదా వరిలో స్నానము చేయువారెవ్వరో యని కనులకు చేయి యడ్డము పెట్టుకొని నిదానించి చూచి, గిరుక్కున మళ్లి యొక బ్రాహ్మ ణుఁడు మెట్లు దిగి వచ్చెను.

బ్రాహ్మణుఁడు:__రుక్మిణమ్మగారూ! సంకల్పము చెప్పెదను స్నానము చేయండి.

రుక్మి:__నేను డబ్బు తీసికొని రాలేదే.

బ్రా:__ డబ్బుకేమి? మధ్యాహ్న మింటివద్ద నిత్తురుగాని లెండి (అని వంగి నిలుచుండి) ఆచమనము చేయండి. కేశవా.నారాయణా. మాధవా.గోవిందా.తూర్పు మొగముగా తిరుగండి, సూర్యునికేసి.

రుక్మి:__స్నానము చేయవలెనా?

బ్రా__సంకల్పము చెప్పనిండి. అని పొడుము బుఱ్ఱను రొండి నుండి తీసి మూతతీసి రెండుమాఱులు నేలమీద మెల్లగా గొట్టి యెడమచేతిలో కొంత పొడుము వేసికొని మరల నెప్పటియట్ల మూఁత వేసి కాయను రొండిని ధోవతిలో దోపుకొని యెడమ చేతిలో నున్న పొడుమును బొటనవేలితోను, చూపుడు వేలితోను పట్ట

36