పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేతిలోని త్రాడు వదలుచు మరల లాగి ఉండగా జుట్టుచు, చేప కల నట వచ్చిన తరువాత నొడ్డునకు లాఁగి పెన్నిధిగన్న పేదవలెఁ బరమానందము నొందుచు, ఒడ్డుదాఁక వచ్చిన తరువాత గ్రహచారము చాలక మత్స్యము త్రాడు తెంపుకొని పఱచిన చేతిలోఁ బడ్డ సొమ్ము పోగొట్టుకున్న వానివలె నిర్వేదించు చేప రాకపోగా రెండణాల గాలము కూడఁ బోయెనని విచారించుచు వట్టిచేతులతో వింటికిఁ బోయెను. ఆ సమీపముననే యొడ్డునఁ జేరి కుఱ్ఱవాండ్రు వెదురుచువ్వ కొక్క దారమును గట్టి దానికొననున్న చిన్న గాలమునకు ఎఱ్ఱలను గ్రుచ్చి నీళ్ళలో వైచుచుఁ దటాలునఁ దీయుచు జిన్నచేపలను బట్టు కొని మరియొక దారమునకు గుదిగ్రుచ్చి 'నాకు బదిజెల్లలు దొరికినవి' 'నాకు నాలుగు పరిగెలు దొరికిన'వని, యెండొరులతోఁ జెప్పుకొనుచు సంతోషించుచుండిరి. అక్కడి జువ్విచెట్టుమీఁదఁ గూర్చుండి చూచు చున్న చెడు గ్రద్దయొకటి యకస్మాత్తుగా వచ్చి యొకటి రెండు పర్యాయములు పిల్లవాండ్రు త్రాడునకు గ్రుచ్చుటకయు చేతం బట్టు కొన్న చేపఁ నెగరఁదన్నుకొని పోయెను.

ఆప్పుడొక్క పెద్దముత్తయిదువ మొగమంతయు నొక్కటే బొట్టుపెట్టుకొని, బట్టలతోనున్న బుజముమీఁది బిందెను తీసి చేతఁ బట్టుకొని రుక్మిణియున్న తావునకు వచ్చి గౌరవముతోఁ ప"అమ్మాయి గారూ! ఏమి, మీరీ వేళ స్నానమునకు దయచేసినారు?"

రుక్మిణి__కార్తిక సోమవారము కాదా? కడపటి సోమ వారము గనుక ప్రదోష వేళ మా ఆమ్మతోకూడ శివాలయమునకు వెళ్ళ వలెనని గోదావరిస్నానము చేయ వచ్చినాను.

పెద్దముత్తైదువ__మీరు రాత్రిదాక భోజనము లేకుండ నుండఁగలరా!

రు__ఒక్కదినమున కేమి? ఏలాగునై న నుందును. మొన్న మీ రెండవ చిన్నదానికి శరీరములో నిమ్మళముగా లేదని చెప్పినావు. ఇప్పడు కొంచెము నిమ్మళముగా నున్నదా?

పె__ఏమి నిమ్మళమో నాకు తెలియదు. మావారు రెణ్ణాళ్ళఁ

28