పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/29

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సగముబట్ట కట్టుకొని తక్కిన సగము నుతుకుకొన్న తరువాత, ఉతికిన భాగమును మార్చికట్టుకొని మిగిలియున్న భాగము నుదుకుకొనుచుండెను; కొందఱు వయసులోనున్న స్త్రీలను గోప్యముగా నుంచఁ దగిన తమ యవయవములు స్నానము చేయుచున్నట్టియు గట్టున నున్నట్టియు పురుషులకుఁ గనబడునట్లు సిగ్గు విడిచి తొడుగుకొన్న రవికలను దీసి యుదుకుటయి తాము కట్టుకొన్న వస్త్రముల నక్కడనే విప్పి యావఱకుదికిన వేఱు తడిబట్టలను చుట్టబెట్టుకొనుచుండిరి. ఆవల పది బారల దూరమున దాసీ జనములు క్రిందఁపడిన మెతుకులకై కావు కావని మూఁగిన కాకులను చేయెత్తి యదలించుచు అంటుతప్పెలలను ఒడ్డునఁ బెట్టుకొని తోము కొనుచుండిరి. ఆ పయిని బెస్తలు పుట్టగోచులతో మొలబంటి నీటిలో నిలుచుండి వలత్రాడు మొలత్రాడునం దోపుకొని రెండు చేతుల తోను వలను త్రిప్పి లోతు నీళ్ళలో విసరిపైచి మెల్లమెల్లగా లాగు చుండిరి. మణికొందఱు లాగిన వలలను నీళ్ళలోఁ బలుమాలు జాడించి యంటుకొనియున్న బురద పోయిన తరువాత గట్టునకుఁ దీసికొనివచ్చి చివరఁ దగిలించియున్న యినుపగుండ్లు గలగలలాడ వలలను విప్పి రాయి రప్ప క్రిందఁ బాఱవైచుచు నగుమనడుమ వల కన్నుల సందున నుండి మిట్టిమిట్టిపడు చిఱుచేపలను చేతులతో నదిమిపట్టి మీలపుట్టికలను చేతఁ బట్టుకొని నిలుచున్న పిన్నవాండ్ర చేతి కందించుచుండిరి. ఆ పయిని నాలుగడుగులు నడిచిన తరువాత దినమున కాఱణాలపాటు పడఁగలిగిన యొక సోమరిపోతు నీళ్ళలో నున్న నడదోనెమీఁది కెక్కి నల్ల యనబడు పేరిన నెత్తురుముద్దను త్రాటి చివరనున్న గాలమునకు గ్రుచ్చి, లేచి నిలువఁ బడి కుడిచేతితో సత్తువకొలఁదిని త్రాడు గిరగిర త్రిప్పి లోతునీట న్విసరిపైచి మరల గూర్చుండి చేప యెప్పుడు చిక్కు నాయని తదేక ధ్యానముతో త్రాడు వంకనే చూచుచు త్రాడు కదిలినెప్పడెల్ల నులికులికి పడుచు దైవవశమున చేప గాలమును మ్రింగి కొట్టుకొనుచుండ మెల్లమెల్లగా లాగుచు, త్రాడు తెంపుకొని పాఱిపోవునో యను భయమునఁ గుడి

27